BigTV English

Python Swallows Big Calf: భారీ దూడను మింగిన కొండచిలువ.. ఇంత చిన్న పైథాన్ అంత పెద్ద దూడను ఎలా మింగేసిందబ్బ..?

Python Swallows Big Calf: భారీ దూడను మింగిన కొండచిలువ.. ఇంత చిన్న పైథాన్ అంత పెద్ద దూడను ఎలా మింగేసిందబ్బ..?

Python Swallows Big Calf: పాము పేరు వినగానే జనం ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. అందులోనూ నాగుపాము, పాము లేదా కొండచిలువ అనే ప్రస్తావన వస్తే దాన్ని చూడాలన్న భయం, కోరిక రెండూ కలకలం రేపుతాయి. ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉన్న ఈ పాములు ఎవరైనా కొన్ని నిమిషాల్లో చంపేస్తాయి. మరి కొన్ని పాములైతే అమాంతం మింగేస్తాయి. అలాంటి భయంకరమైన వీడియోలు నిరంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇటువంటి వీడియోనే ప్రముఖ జంతు ప్రేమికుడు మురళివాలే యూట్యూబ్‌లో షేర్ చేశారు.


మురళీవాలే చాలా ప్రసిద్ధ జంతు ప్రేమికుడు. ఆయన సొంతంగా యూబ్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలను మురళీ షేర్ చేస్తుంటాడు. ఇప్పటికి అతడు ఛానెల్‌లో వందల సంఖ్యల్లో వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కువగా పాములకు చెందినవై ఉండటం విశేషం. మురళీవాలేకు నోరులేని జంతువులపై అమితమైన ప్రేమ. అందుకనే అతడు జనవాసాల్లోకి ప్రవేశించే పాములను సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతాల్లో విడిచేస్తాడు.

మురళీ తరచూ తన సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ల వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తుంటారు. అతని వీడియోలను నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. వారి అన్ని వీడియో క్లిప్‌లు లేదా ఫుటేజీలు ఈ నోరులేని జీవుల రక్షణ గురించి ఉంటాయి. అయితే అతడు ఓ భారీ కొండచిలువకు చెందిన వీడియోను షేర్ చేశారు. అది చూస్తే కచ్చితంగా మీ కుడుపులో తిప్పుతుంది.


Also Read: 20 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. ఎంత చురుగ్గా పామును బోల్తా కొట్టించాడో చూడండి!

అసలు మ్యాటర్‌లోకి వెళితే అతడు షేర్ చేసిన వీడియో ఏమిటంటే.. ఓ భారీ కొండచిలువ చిన్న గ్రామంలోకి  ప్రవేశించింది. ఎక్కడో అడవి ప్రాతం నుంచి బాగా ఆకలి మీద వచ్చినట్లుగా ఉంది. ఆహారం కోసం ఆ చుట్టూ వెతికింది. ఇంతలోనే దాని కంట్లో మేత మేస్తున్న దూడ పడింది. ఇక ఆలస్యం చేయకుండా అమాంతం దాన్ని చుట్టేసింది. ఊపిరి ఆడకుండా చేసి దూడ ప్రాణాలు తీసింది. దూడ తలను నోటిలో పెట్టుకొని మింగడం ప్రారంభించింది.

Also Read: వింతగా ప్రవర్తించిన పెళ్లికూతురు.. వణుకుతు పరారైన వరుడు.. వీడియో!

అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. దూడను మింగేసిన కొండచిలువ అక్కడి నుంచి ముందుకు కదలలేకపోయింది. ఆ ప్రాంతం నుంచి ఎలా బయటపడాలో తెలియక నానా అవస్థలు పడింది. ఇంతలోనే ఈ సంఘటన చూసిన స్థానిక ప్రజలు దాని చుట్టూ గుమిగూడారు. సమాచారాన్ని మురళీవాలేకు అందించారు. దీంతో హుటాహుటిన మురళీ ఘటన స్థాలానికి చేరుకొని కొండచిలువను ఆ సమస్య నుంచి విడిపించాడు. ఒక సంచిలో దాన్ని పట్టుకొని సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ వీడియోకు ఇప్పటికే 884K మంది లైక్ చేశారు. 1,020 మంది కామెంట్లు చేశారు.

Tags

Related News

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Big Stories

×