BigTV English
Advertisement

Wedding: చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించిన వరుడు.. కారణం తెలిసి అంతా షాక్ ( వైరల్ వీడియో)

Wedding: చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించిన వరుడు.. కారణం తెలిసి అంతా షాక్ ( వైరల్ వీడియో)

Groom Cancels wedding: అక్కడ ఇంకొద్దిసేపట్లో జరగబోయే పెళ్లి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వధువుకు కళ్యాణ మండపానికి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు, చుట్టాలు.. వరుడి చుట్టాలు కూడా వచ్చారు. కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరగబోయే వివాహ కార్యక్రమాన్ని తిలకించేందుకు అంతా రెడీగా ఉన్నారు. ఇక వరుడు రావడమే ఆలస్యం.. అతను వస్తే పెళ్లి కార్యక్రమం స్టార్టవ్వబోతుందన్న సమయంలో వరుషాడు షాకింగ్ విషయం చెప్పాడు. తాను ఈ పెళ్లి చేసుకోబోనని చివరి క్షణంలో చెప్పాడు.


వరుడు చివరి క్షణంలో పెళ్లికి ఎందుకు నిరాకరిస్తున్నాడన్న కారణం తెలిసి వాళ్లంతా షాకయ్యారు. ఏం మాట్లాడాలో వాళ్లకు అర్థం కాలేదు. చివరి నిమిషంలో వరుడు పెళ్లికి నిరాకరించడంతో వధువు కన్నీరుమున్నీరయ్యింది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వధువు వేడుకుంది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన రసూల్ పూర్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కార్యక్రమం కోసమై వధువు తరఫువారు కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, చుట్టాలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంకొద్దిసేపట్లో జరగబోయే వివాహ కార్యక్రమాన్ని చూసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.


ఈ క్రమంలో ఓ వార్త చెప్పాడు వరుడు. తాను పెళ్లిని నిరాకరిస్తున్నట్లు చివరిక్షణంలో చెప్పాడు. అది విని అంతా షాకయ్యారు. అదేంటి ఇంకొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందన్న సమయంలో వరుడు ఇలా చేశాడని, వరుడు పెళ్లికి నిరాకరించడాని గల కారణం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వధువు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విలపించింది.

వరుడు కారు అడిగాడని, ఇందుకు ఓకే చెప్పిన తన తల్లిదండ్రులు అతనికి కారు కొనిచ్చారు.. కానీ, తను అడిగన రూ. 25 లక్షల కారు కొనివ్వకుండా రూ. 7 లక్షల కారు కొనిచ్చారంటూ వరుడు చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించాడంటూ ఆమె విలపిస్తూ ఆరోపించింది. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ఆమె ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది.

Also Read: భారీగా ఎగబడిన ఫ్యాన్స్.. షాకైన క్రికెటర్లు (వీడియో వైరల్)

ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ విషయం తెలిసి వరుడు పరారీలో ఉన్నట్లు పలు వార్తల్లో పేర్కొన్నారు. అదేవిధంగా వరుడు ప్రభుత్వ ఉద్యోగి అని, అయినా కూడా అతను ఇలా ప్రవర్తించాడని, అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారని అందులో పేర్కొన్నారు.

Tags

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×