BigTV English

Viral Video: టిక్కెట్ లేని ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..?

Viral Video: టిక్కెట్ లేని ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..?

 


Viral Video: టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేయడం నేరం అని తెలిసినా చాలా మంది ప్రయాణికులు అదే చేస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టడం చూసే ఉంటాం. ముఖ్యంగా బస్సుల్లో, రైళ్లలో ఇలా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఏకంగా జనరల్ కంపార్ట్మెంట్ కాకుండా ఏసీ భోగిల్లో కూడా టిక్కెట్ లేని ప్రయాణాలు చేసిన దాఖలాలు కూడా ఉంటాయి. అయితే చాలా సార్లు ఇలా వింటూ ఉంటాం కానీ, ఎప్పుడూ చూసి ఉండం. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న కొంత మంది ప్రయాణికులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. సెహెయిల్దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని స్లీపర్ కోచ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. కొంత మంది ప్రయాణికులు టిక్కెట్ లేకుండా, మరికొంత మంది ప్రయాణికులు జనరల్ టిక్కెట్లతో స్లీపర్ కోచ్ లో ప్రయాణిస్తున్నారని ఓ ప్రయాణికులు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ట్రైన్ నంబర్ 22420లో టిక్కెట్ లేకుండా రైలులోని సీట్ల మధ్యలో కొంత మంది ప్రయాణికులు కూర్చుని ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.


Also Read: మతుండే ఈ పని చేస్తున్నారా.. రూ. 200 కోట్ల ఆస్తి విరాళం ఇచ్చి సన్యాసిగా మారుతున్నారట..

అసలే ఇరుకుగా ఉండే రైలులో సీట్ల మధ్యలో కూడా కూర్చుని ప్రయాణించడం మూలంగా తమకి ఇబ్బంది కలుగుతుందని పేర్కొంటే రైల్వేకు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశాడు. దీనికి రైల్వే సేవ స్పందిస్తూ.. తమ ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని కోరింది. లేదా 139కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. కాగా, ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Related News

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

Viral Video: వీడెవడండి బాబు.. చంపిన ప్రతి దోమను దాచిపెట్టి ఏం చేస్తున్నాడంటే?

Viral News: మెట్రో స్టేషన్‌లో అడుక్కుంటున్న యువతి.. ఏం కష్టం వచ్చిందో?

Hyderabad News: హైదరాబాద్‌ సిటీలో కొబ్బరికాయల దొంగ.. ఆటోడ్రైవర్ అర్థరాత్రి, పగలు వ్యాపారం

Watch Video: మీకు సన్ రూఫ్ కారు ఉందా? కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే!

Viral Video: కదులుతున్న రైల్లో కత్తితో పొడిచి, వామ్మో.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Big Stories

×