CM Revanth Reddy on BJP Manifesto: దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్రే మరలా పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమే విజయం సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
20 ఏళ్లు గడిచినా బీజేపీ మేనిఫెస్టోలో మార్పు రాలేదని అన్నారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ.. 2024లో కూడా వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
గతంలో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నా సరే.. దేశ ప్రజలు సోనియాగాంధీ నేతృత్వంలో తిరస్కరించారని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల మరోసారి దేశంలో అప్పుడు బీజేపీ ఎలాంటి పరిస్థితి అయితే ఎదురైందో.. మరోసారి అలాంటి పరిస్థితే వస్తుందన్నారు.
అప్పటిలాగే ఇప్పుడు కూడా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీకి శుభం పలికి.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ను దేశ ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశగా చూస్తున్నారని అన్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంకు ఇచ్చిన చెక్కులా ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
BJP’s ‘Viksit Bharat’ is a repeat of their
2004 “Shining india” manifesto.After two failed terms,People had rejected “Shining India” under the leadership of
Smt #SoniaGandhi ji.Now after two disappointing terms, people will reject BJP and Congress led by #RahulGandhi ji… pic.twitter.com/ZntbvVcbjs
— Revanth Reddy (@revanth_anumula) April 14, 2024