BigTV English

OTT Movie : హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ సినిమా… ఆ బుక్ చదివితే బ్రతికుండగానే నరకం

OTT Movie : హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ సినిమా… ఆ బుక్ చదివితే బ్రతికుండగానే నరకం

OTT Movie : హర్రర్ సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇదొక అడిక్షన్, బ్యాడ్ హ్యాబిట్ లాగా ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఈ హర్రర్ సినిమాలను చూస్తున్నప్పుడు ఓవైపు వణికిపోతున్నా సరే సినిమాలను చూడడం మాత్రం మానరు. అవసరమైతే దుప్పటి కప్పుకుని, లేదంటే కళ్ళు మూసుకుని అయినా సరే హర్రర్ సినిమాలను చూసేటంత పిచ్చి ఉంటుంది చాలా మందికి. అంతేకాకుండా కనీసం వారంలో ఒక్క హారర్ సినిమా అయినా చూడనిదే వాళ్ళకు నిద్ర పట్టదు. ఇక ఆ మూవీ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉందంటే హారర్ మూవీ లవర్స్ కు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఇలా క్రేజీగా హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఓటిటిని ఊపేస్తున్న ఈ హర్రర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

హర్రర్ సినిమాలు అంటే ఓ లెక్క ఉంటుంది. వణుకు పుట్టించేలా ఉండే కిక్ కోసమే ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అద్భుతమైన హర్రర్ ఎలిమెంట్స్ తో ఫుల్ థ్రిల్ ఇచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా గూస్ బంప్స్ తెప్పించే ఈ స్టోరీని డైరెక్టర్ రూపొందించిన తీరుకు మెచ్చుకోకుండా ఉండలేరు. సినిమా మొత్తం తల్లి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ది బ్యాడ్ బుక్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే…

సినిమాలో హీరోయిన్ సింగిల్ పేరెంట్. భర్త చనిపోవడంతో కొడుకుతో కలిసి సింగిల్ గా జీవిస్తుంది. ఉద్యోగం చేస్తూ పిల్లాడిని ఒక్కతే పోషిస్తుంది. ఇక ఆ పిల్లోడు కూడా స్కూల్ కి వెళ్తూ తల్లితో సంతోషంగా ఉంటాడు. ఈ క్రమంలోనే వాళ్ళ ఇంట్లో ఓ బుక్ కనిపిస్తుంది. దీంతో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ఆ బుక్ ను తీసి చదువుతారు. కానీ అదే ఆ తల్లి కొడుకులు ఇద్దరికీ అతిపెద్ద శాపంగా మారుతుంది. ఆ పుస్తకంలో ఒక రాక్షసుడు వస్తే అనర్ధాలు జరుగుతాయని రాసి ఉండడం కనిపిస్తుంది. అయితే అంతకంటే ముందే ఆ పుస్తకాన్ని చూడగానే భయం వేసేలా ఉంటుంది. మొత్తానికి ఈ పుస్తకాన్ని చదివి తల్లి కొడుకులు ఇద్దరు తప్పు చేస్తారు. బుక్ ఓపెన్ చేసింది మొదలు వింత వింత సంఘటనలు జరుగుతూ తల్లి కొడుకులు ఇద్దరినీ భయపడతాయి. కొడుకు అయితే ఏకంగా పుస్తకంలో ఉన్న రాక్షసుడు కనిపించాడు అంటూ భయపడతాడు. అలాగే తల్లికి కూడా జరుగుతుంది. చివరికి తల్లి కొడుకులు ఇద్దరికీ ఆ రాక్షసుడు కనిపిస్తాడు. మరి అసలు ఈ రాక్షసుడు తల్లి కొడుకులు ఇద్దరికీ ఎందుకు కనిపిస్తున్నాడు? అసలు ఆ బుక్ లో ఉన్న ఈ రాక్షసుడు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ది బ్యాడ్ బుక్ సినిమాను చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×