Viral Video: క్రికెట్ పిచ్చి ఏమోగానీ ఆ మత్తులో చిత్తయ్యారు. ఆపైన హద్దులు దాటారు ఇద్దరు యువకులు. ఆ మైకంలో ఏం చేస్తున్నారో తెలుసు కోలేకపోయారు. పక్కనున్నవారు రెచ్చగొట్టడంతో ఇదేమో బాగుందని ట్రై చేశారు. అడ్డంగా బుక్కయ్యారు. విజయవాడలో జరిగిన ఓ ఘటనపై ఆ యువకులు ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం.
అహ్మదాబాద్ వేదికగా జూన్ 3న ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. అందులో పంజాబ్‌పై బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ డ్రీమ్ నెరవేరింది. దీంతో క్రికెట్ లవర్స్ రోడ్లపై నానా హంగామా చేశారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు.
చాలా రాష్ట్రాల్లో ఇదే తంతు నడిచింది. అదే రోజు విజయవాడలో ఇద్దరు యువకులు రోడ్లపై నానాయాంగీ చేశారు. క్రికెట్ పేరుతో మద్యం తాగిన మత్తులో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌ను రోడ్డుపై చాలాదూరం లాక్కుంటూ వెళ్లిపోయారు. ఆ సన్నివేశాన్ని మరో ఇద్దరు యువకులు వీడియోలో షూట్ చేశారు.
ఇదేదో బాగుందని మరింత రెచ్చిపోయారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. చివరకు వైరల్ అయ్యింది. వ్యూస్ బాగానే వచ్చాయి. దీంతో ఆ యువకులు ఫుల్ ఖుషీ. చివరకు వీరి యవ్వారంపై కృష్ణలంక పోలీసులు దృష్టిపెట్టారు. తీగలాగితే డొంక కదిలింది. ఎట్టకేలకు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: భారీ నాగుపామును నాగస్వరంతో ఊది.. చేతితో పట్టుకుని చివరకు
పోలీసుల ట్రీట్‌మెంట్ తో వారికి తత్వం బోధపడింది. మాకు మాదిరిగా చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నారు. పేరెంట్స్ చెప్పిన మాట విని జాగ్రత్తగా ఉండాలంటూ అందులో యువతకు సూచన చేశారు. తస్మాత్.. జాగ్రత్త, యువత ఇప్పటికైనా మేలుకో.
Thank You @APPOLICE100 👍 https://t.co/vechHbwgTi pic.twitter.com/ki6HHYd3NT
— Mahesh Goud 🚩 #9999# (@indian66669296) June 5, 2025