Shine Tom Chacko: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ మలయాళ నటుడిగా పేరు సొంతం చేసుకున్న షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి సీపీ చాకో (CP Chacko) మరణించారు. అసలు విషయంలోకెళితే తాజాగా షైన్ టామ్ చాకో కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. ఇందులో ఆయన తండ్రి మరణించారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో వారు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో షైన్ టామ్ చాకో తండ్రి చాకో అక్కడికక్కడే చనిపోగా.. చాకో , అతడి తల్లి, సోదరుడు, డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక చాకో ఇంట్లో విషాదం అలుముకోవడమే కాకుండా.. ఇప్పుడు కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ పాలవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షైన్ టామ్ చాకో సినీ జీవితం..
1983 సెప్టెంబర్ 15న కేరళ త్రిసూర్ లో జన్మించారు. 2002లో ‘నమ్మాల్’ అనే సినిమాలో ఒక బస్సు ప్రయాణికుడిగా చిన్న పాత్రతో తన కెరీర్ ను మొదలుపెట్టారు ఆ తర్వాత మలయాళ సినిమా సహాయ దర్శకుడిగా కెరియర్ ఆరంభించిన ఈయన.. దాదాపు 9 సంవత్సరాల పాటు ప్రముఖ దర్శకుడు కమల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. ఆ తర్వాత ‘ఖద్దమా’ అనే సినిమా ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టారు.
ఇక 2012లో వచ్చిన ‘అదుతా కాలతూ’, 2012లోనే ‘చాప్టర్స్’, 2013లో ‘అన్నయుమ్ రసూలం’, 2014లో ‘మసాలా రిపబ్లిక్’ వంటి పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఇక 2014లో వచ్చిన ‘ఇతిహాస’ అనే సినిమాతో హీరోగా నటించి, ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక్కడ పెరిగిన పరిచయంతో పలు సినిమాలలో హీరోగా అవకాశాన్ని అందుకున్నారు.
ALSO READ: Deepika Padukone: అతడితో 2 ఏళ్లు డేటింగ్.. దీపికా గుట్టు రట్టు చేసిన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్!
షైన్ టామ్ చాకో నటించిన తెలుగు చిత్రాలు..
ఇకపోతే అలా మలయాళంలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత తెలుగు దర్శకులను ఆకర్షించారు. అలా 2003లో నాని హీరోగా వచ్చిన ‘దసరా’ సినిమాతో విలన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ తన విలక్షణమైన నటనతో ఆడియన్స్ ను అబ్బురపరిచారు. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన ‘రంగవల్లి’ సినిమాలో కూడా నటించారు. 2024లో ‘దేవర’ సినిమాలో తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు.
ఇక ఆ తర్వాత ‘బీస్ట్’, ‘కురూప్’, ‘భీష్మ పర్వం’ వంటి బహు భాషా చిత్రాలలో కూడా నటించి తెలుగు ఆడియన్స్ హృదయాలను మెప్పించారు. ఇకపోతే ఇప్పుడు అనూహ్యంగా ఈయన కుటుంబానికి జరిగిన ప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఈయనకు తబీత అనే భార్యతో పాటు ఒక బిడ్డ కూడా ఉన్నారు.
రోడ్డు ప్రమాదం.. ‘దసరా’ నటుడికి గాయాలు
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో కారులో నటుడు, ఆయన తల్లి కూడా ఉన్నారు. వారికి తీవ్ర గాయాలు… pic.twitter.com/NS4nUWcKUc
— ChotaNews App (@ChotaNewsApp) June 6, 2025