Snake viral video: మనం రోడ్డు వెంట మామూలుగా నడుచుకుంటే వెళ్తుంటే పాము కనబడితే భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తుతాం. పాము ఎక్కడ హానీ చేస్తుందో అని దూరంగా వెళ్లిపోతాం. అయితే కొంత మంది మాత్రం పాములతో పిచ్చి ఆటలు ఆడుతూ ప్రాణాలనే కొనితెచ్చుకుంటున్నారు. మరి కొంత మంది పాముల దగ్గరకు వెళ్లి ఫోటోలకు పోజులిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఇంట్లోకి దూరి హల్చల్ చేసిన నాగుపాము ఇలాంటి వీడియోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి. తాజాగా మొక్కజొన్న కంకుల నుంచి భారీ నాగుపాము బయటకు వచ్చి పడగ విప్పిన వీడియోసోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ కింగ్ కోబ్రా పాములోడి చేతికి చిక్కిన ఘటన మనం వీడియోలో చూడవచ్చు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ రైతు మొక్కజొన్న పంటను మార్కెట్ కు తరలించేందుకు ఓ వాహనంలో కంకులను నింపుతున్నాడు. అయితే మొక్కుజొన్నలను వాహనంలో నింపే క్రమంలో వాటి నుంచి ఒక్కసారిగా పాములు బుసలు పొంగుకుంటూ బయటకొచ్చింది. దీంతో రైతు అటువైపున వెళ్తున్న పాములోడిని చూసి.. వెంటనే పిలిచాడు. ఆ పాములోడు నాగ స్వారం బూరను పట్టుకుని ఊదుతూ.. నాగుపామును దృష్టిని మళ్లించి.. దాన్ని చేతితో పట్టుకున్నాడు. అనంతరం ఆ భారీ పామును బుట్టలో వేసుకుని వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఇది నిజంగా జరిగిందా..? కావాలనే క్రియేట్ చేశారా..? అనేది మాత్రం తెలియదు.
భారీ సెక్యూరిటీ #viralvideo #snake pic.twitter.com/KKKFcjEZKW
— srk (@srk9484) June 3, 2025
దీనిపై పలువురు పలువిధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ముందస్తుగా ప్లాన్ చేసి.. రీల్స్ కోసం వీడియో తీశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది అంతపెద్ద నాగుపామును చేతితో ఎలా పట్టుకున్నాడు..? అని.. ఇంకొంత మంది పాములు పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి పిచ్చి వేషాలు వస్తే ప్రాణాలకే ప్రమాదమని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి పాము వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా కొందరు ఆకతాయిలు.. ఓ పాము పుట్ట వద్ద చెట్టుకు టేప్ రికార్డర్ ను అమర్చి నాగస్వరం పాటను పెట్టారు. ఆ పుట్టలో నుంచి పాము బయటకొచ్చి పడగవిప్పి కొద్దిసేపు నాట్యం ఆడినట్టు వీడియోలు కనిపిస్తోంది. ఇటీవల కొన్ని రోజుల నుంచి పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ALSO READ: UPSC Notification: భారీ శుభవార్త.. యూపీఎస్సీలో 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్,
వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి.. పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలుకలను తినేందుకు పాములు ఇంట్లోకి సంచరిస్తాయి. అలాగే పక్షులు గూడు కట్టుకున్నా పాములు ఇంట్లోకి వస్తాయి. కాబట్టి పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. పాములు సాధారణంగా చెత్త, కలుపు మొక్కలు, రాళ్లు, రప్పల మధ్య ఉండేందుకు చాలా ఇష్టపడతాయి. కాబట్టి, ఇంటి చుట్టూ ఉన్న పొదలు, గడ్డి, చెత్త కుప్పలను తీసివేసి శుభ్రంగా ఉంచుకోండి. పచ్చని గడ్డిని కత్తిరించి, ఆకులు, పిచ్చి మొక్కలు వంటివి శుభ్రం చేయండి. ఇంటి బయట ఉన్న రాళ్ల కుప్పలను కూడా తొలగించడం మంచిది. ఎందుకంటే అవి పాములకు ఆశ్రయం కల్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ALSO READ: పాములు ఇంటికి రాకుండా ఉండాలంటే..