BigTV English

Viral Video: నిజంగానే జాతీయ జెండాను ఆ పక్షి ఆవిష్కరించిందా? నిజం ఇదే

Viral Video: నిజంగానే జాతీయ జెండాను ఆ పక్షి ఆవిష్కరించిందా? నిజం ఇదే

Bird Unfurl Flag: ఆగస్టు 15వ తేదీన దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలను జరుపుకున్నట్టే కేరళలో కూడా జాతీయ జెండా ఎగురవేసి వేడుక చేసుకున్నారు. కేరళలోని ఓ ప్రాంతంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో పవిత్ర ఘటన జరిగిందని, దైవం నేరుగా ఈ పతాకావిష్కరణలో ప్రమేయం చేసుకుందని వాదనలు వచ్చాయి. ఇందుకు ఓ వీడియో కారణంగా ఉన్నది.


కేరళలో ఓ చోట జాతీయ జెండాను ఎగురవేస్తుండగా జెండా పోల్ చివరి దాకా వెళ్లాక విచ్చుకోవడంలో సమస్య ఏర్పడింది. అప్పుడు ఓ పక్షి ఎక్కడి నుంచో వచ్చి.. అందులో ప్రమేయం కల్పించుకున్నట్టుగా ఆ వీడియో వివరిస్తు్న్నది. ఆ పక్షి జెండా విచ్చుకుని పూర్తిగా ఆవిష్కరించుకోవడానికి సహకరించిందని వీడియో చూసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇది దైవ జోక్యమేనని పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇలాంటి ఘటనలు మరింత మెమోరబుల్‌గా చేస్తాయని అభిప్రాయపడ్డారు. మన దేశ స్వాతంత్ర్య వేడుకలకు దేవుడు అండగా ఉన్నాడని మరొకరు పేర్కొన్నారు.

Also Read: Chandrababu meets PM Modi: ప్రధాని మోదీతో ఏపీ సీఎం కీలక భేటీ.. సమావేశం అనంతరం చంద్రబాబు..

కాగా, ఈ వాదనను వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. ఆ పక్షి ఎక్కడో శూన్యంలో నుంచి ఏమీ రాలేదని, వెనుక ఉన్న చెట్ల నుంచి పక్షి వస్తున్నట్టుగా స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నదని కామెంట్ చేశారు. అక్కడి నుంచి ఆ పక్షి వచ్చి జెండా పోల్‌కు సమీపంలో కొబ్బరి చెట్టు కొమ్మపై వాలిందని వివరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. అయితే, కెమెరా యాంగిల్ వల్ల ఆ పక్షి జెండా వద్దకు వచ్చి అది విచ్చుకోవడంలో సహకరించినట్టుగా కనిపిస్తున్నదని తెలిపారు. అంతే తప్పితే పక్షి నిజంగానే జెండాను ఆవిష్కరించలేదని వాదించారు. వీడియోను శ్రద్ధగా పరిశీలించి చూస్తే ఇది అర్థమవుతుందని వివరించారు. చాలా మందికి ఈ వీడియో పై ఉన్న అనుమానాలు పై కామెంట్లతో తొలగిపోయాయి.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×