BigTV English

New Delhi: కొత్త వివాదంలో చిక్కుకున్న బజరంగ్ పూనియా, నెటిజన్లు ఫైర్‌..

New Delhi: కొత్త వివాదంలో చిక్కుకున్న బజరంగ్ పూనియా, నెటిజన్లు ఫైర్‌..

Bajrang Punia Caught In A New Controversy, Netizens Are On Fire: పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌ 2024లో రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. శనివారం ఆమె నేరుగా రాజధాని ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌కి తిరిగివచ్చారు.ఈ ఒలింపిక్స్‌ ఈవెంట్‌ నుంచి ఆమె డిస్‌క్వాలిఫై అయ్యాక, సిల్వర్ మెడల్ కోసం కోర్ట్‌ ఆఫ్ అర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ కాస్‌లో అప్పీల్ చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమిలేక నేరుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు రేజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో పాటు ఇండియన్ స్పోర్ట్స్‌ అభిమానులు అంతా భారీగా ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆమెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు తోటి క్రీడాకారులు.


అయితే అక్కడి వరకు బాగానే ఉంది. కానీ.. కారుపైకి ఎక్కిన రెజ్లర్ బజరంగ్ పూనియా వివాదంలో చిక్కుకున్నాడు. ఎందుకంటే ఆ కారుపై భారత జాతీయ జెండాతో అలంకరించబడింది. దీంతో తనకు తెలియకుండానే కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడు. అక్కడికి వచ్చిన వారిని కంట్రోల్ చేయడానికి కారు ముందుభాగం పైకి ఎక్కి కంట్రోల్‌ చేస్తూనే.. మరోవైపు మీడియా లోగో మైకులను తీసుకుని వినేశ్ ఫోగట్‌ ముందు పెట్టాడు. ఈ సీన్ అంతా ఓ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read: భారంతో భారత్‌కి తిరిగి వచ్చిన రెజ్లర్ వినేశ్, ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్


దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు గరం గరం అవుతున్నారు. మరికొందరు అయితే షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. జాతీయ జెండాపై ఉన్న గుర్తులున్న పోస్టర్‌పై నిల్చోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు అయితే అతను కావాలని అలా ఏం చేసి ఉండడంటూ సపోర్ట్ చేస్తున్నారు. అక్కడున్న జనాలను కంట్రోల్ చేసే క్రమంలో అలా జరిగి ఉండవచ్చని.. ఆ మాత్రం దానికే ప్రతీదాన్ని బూతద్దంలో పెట్టి చూడటం కరెక్ట్ కాదంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×