BigTV English

Shocking Incident: మహిళ కడుపులో 30 కిలోల కణితి.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు..

Shocking Incident: మహిళ కడుపులో 30 కిలోల కణితి.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు..

Shocking Incident: తరచూ ఏదో ఒక ఘటనకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా సర్జరీలకు సంబంధించినవి అయితే తెగ హల్ చల్ చేస్తుంటాయి. ఏదో ఒక వినూత్నమైన సమస్యతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే ఘటనలు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధులు, ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అయితే తాజాగా కజకిస్తాన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కజకిస్తాన్‌లోని ఓ వైద్య బృందం 65 ఏళ్ల మహిళ కడుపు నుండి 30 కిలోల కణితిని విజయవంతంగా తొలగించింది. ఈ అసాధారణ ఘటన పలువురిని విస్మయానికి గురి చేసింది.


ఓ మహిళ చాలా నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. బొడ్డు పరిమాణంలో అసాధారణమైన మరియు భయంకరమైన పెరుగుదలలా తాను భావించింది. కొంత కాలం పాటు ఈ బాధను భరించిన తర్వాత, ఆమె కజకిస్తాన్‌లోని ఒక ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను సంప్రదించింది. ఈ తరుణంలో సమస్య తెలుసుకున్న వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించి ఆమె కడుపులో ఒక భారీ కణితి ఏర్పడినట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో తక్షణమే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అల్మాటీలోని కజక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రేడియాలజీకి చెందిన బృందం ఈ సర్జరీని నిర్వహించింది. ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడనిది ఈ ఘటన అని వెల్లడించింది. ఏకంగా మహిళ కడుపుతో 30 కిలోల కణితి గుర్తించినట్లు తెలిపింది. కణితిని తొలగించిన తర్వాత దాని పరిమాణం చూసి సర్జన్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ కణితి డిసెంబర్ 2023లో చిన్నగా పెరగడం ప్రారంభమై జూలై 2024 నాటికి 30 కిలోలుగా పెరిగింది. ఆంకోగైనకాలజీ సెంటర్ హెడ్ ఎర్లాన్ కుకుబాసోవ్ మార్గదర్శకత్వంలో, వైద్య బృందం ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. కాగా 2014లో చైనాలోని యాంగ్ జియాన్బిన్ 110 కిలోగ్రాముల వరకు పెరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.


Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×