Train chasing viral video: ఓ రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధుడు ప్లాట్‌ఫామ్ బల్లపై కూర్చొని మొబైల్‌లో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో ట్రైన్ వచ్చి ఆగింది, కానీ అతను గమనించలేదు. ట్రైన్ కదలడంతో ఆ వృద్ధుడు ఏకంగా పరుగులు పెడుతూ దాన్ని ఛేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన.. ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే?
రైల్వే స్టేషన్ లో ఓ వృద్ధుడు తన ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ట్రైన్ ఎప్పుడొస్తుందో చూడాల్సిన సమయంలో, ఆయన మొబైల్ లో మునిగిపోయారు. స్టేషన్ లోని ఓ బల్లపై కూర్చొని పూర్తిగా తన ఫోన్‌లోనే గమ్యం పెట్టారు. అదే సమయంలో ట్రైన్ స్టేషన్‌కు చేరింది, కొన్ని క్షణాలు ఆగింది, తర్వాత తిరిగి కదిలింది.
వేగంగా వెళుతున్న ట్రైన్.. తర్వాత గుర్తుపట్టిన వృద్ధుడు
ట్రైన్ వచ్చిందన్న విషయం ఆ వృద్ధుడికి మొబైల్‌లో మునిగిపోయిన తర్వాతే తెలిసింది. అప్పటికే ట్రైన్ కదులుతుండగా, తాను ఎక్కాల్సిన ట్రైన్ పోతుందనే ఆవేశంలో వెంటనే పరుగులు పెట్టాడు. వృద్ధుడి శరీరానికి వయసుతో పాటు బరువు తోడైంది. అయినా ట్రైన్ ఎక్కాలన్న ఆతురతతో రన్నింగ్ ట్రైన్‌ను వెంబడిస్తూ ప్రయత్నించాడు.
ప్రమాదకరంగా కింద పడిన వృద్ధుడు
అయితే రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో, ఆయన నడక స్థిరంగా లేకపోవడంతో ఒక్కసారిగా బాలెన్స్ కోల్పోయి నేరుగా కింద పడిపోయారు. ట్రైన్ మార్గానికి బాగా దగ్గరగా పడిపోవడంతో ఒక్క క్షణం మొత్తం స్టేషన్ లో ఉన్నవారు షాక్ కి లోనయ్యారు. వీడియో చూస్తే హృదయం ఝల్లుమనే ప్రమాదకర దృశ్యం ఇది.
వెంటనే స్పందించిన రైల్వే కానిస్టేబుల్
అయితే ఆ ప్రాణాంతక క్షణాల్లో ఓ దేవుడు లాంటి వ్యక్తి అక్కడే ఉన్నాడు ఆయనే రైల్వే పోలీస్ కానిస్టేబుల్. ఎలాంటి ఆలస్యం లేకుండా, వెంటనే స్పందించిన కానిస్టేబుల్ వృద్ధుడిని పట్టుకొని వెంటనే ట్రాక్ వైపు నుంచి బయటకు లాగేశాడు. పోలీస్ సమయస్ఫూర్తితో ఆ ప్రాణం నిలిచిపోయింది.
ఓ చిన్న అలసత్వం.. ఓ పెద్ద ప్రమాదం
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ ఒకే ఒక్క విషయం గుర్తుకురావాల్సింది.. స్టేషన్‌లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ట్రైన్ ఎక్కే సమయంలో మన దృష్టి మొత్తం ప్లాట్‌ఫార్మ్ పై ఉండాలి. చిన్న అలసత్వం, తేలికపాటి గమనాహీనత జీవితం మొత్తం మార్చేసే ప్రమాదానికి దారి తీస్తుంది. మొబైల్ ఓకే, కానీ దాన్ని చూడటానికి అనువైన సమయం కావాలి. ఇలా స్టేషన్‌ల్లో మొబైల్ చూసుకుంటూ ఉండటం ప్రాణాలకు భయం తెచ్చిపెడుతుంది.
Also Read: Amrit Bharat Express in AP: విజయవాడ to విశాఖ అమృత్ భారత్ ట్రైన్.. ఏయే స్టేషన్లో ఆగనుందంటే?
వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. వృద్ధుడి పడిపోవడం, వెంటనే పోలీస్ రక్షించడం అన్నీ కెమెరాలో బంధించబడ్డాయి. వీడియో చూసిన నెటిజన్లు.. ఈ పోలీస్‌కి సలాం, ట్రైన్ స్టేషన్‌లో మొబైల్ చూడకండి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది ఈ కానిస్టేబుల్‌కు అవార్డు ఇవ్వాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
హీరోలందరిలోనూ ఓ రియల్ హీరో
ఇలాంటి సమయంలో వెంటనే స్పందించడం ప్రతి ఒక్కరికి సాధ్యపడదు. ఆ కానిస్టేబుల్ తన విధి నిర్వర్తించిన తీరు.. నిజంగా ఓ రియల్ హీరోగా నిలిచేలా చేసింది. అతడి సాహసం వల్ల ఓ వృద్ధుడు ప్రాణాలతో ఉన్నాడు. ఒక్క నిర్ణయం, ఒక్క క్షణంలో తీసుకున్న చర్య ఎంత విలువైనదో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
https://twitter.com/sarviind/status/1946885881803022516
ఈ వైరల్ వీడియో కేవలం ఒక సంఘటన కాదు. ఇది ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. స్టేషన్లలో, ట్రైన్ సమీపంలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ మన జీవితాన్ని ముప్పు పెడుతుంటే… మనకు ప్రాణం కంటే అది ముఖ్యం కాదు. అలాంటి ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే ఆ పోలీస్ లాంటి వ్యక్తులు.. నిజంగా గౌరవానికి అర్హులు. ఈ సంఘటన అందరికీ కనువిప్పు కావాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.