BigTV English

Bali: అక్కడి బీచ్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్తే.. ఈ భయానక రోగానికి గురవ్వడం పక్కా!

Bali: అక్కడి బీచ్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్తే.. ఈ భయానక రోగానికి గురవ్వడం పక్కా!

సహజ సందర్యం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ ఇండోనేషియా. ఈ దేశంలోని అందమైన ద్వీపం బాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులను ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిత్యం ఈ ప్రాంతాన్ని చూసి సరదాగా గడిపేందుకు వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఎంతో అందమైన ప్రదేశంలో ఇప్పుడు భయంకరమైన వ్యాధి విజృంభిస్తోంది. రాబిస్ వ్యాధి రోజు రోజు వేగంగా విస్తరిస్తోంది. పలు దేశాలు తమ పౌరులను అక్కడికి వెళ్లకూడదంటూ ఆదేశాలను జారీ చేశాయి. బాలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలని యుఎస్, యుకె, స్ట్రేలియన్ హెల్త్ డిపార్ట్ మెంట్స్ వార్నింగ్ ఇచ్చాయి.


బాలిలో రాబిస్ ముప్పు ఎందుకు పెరుగుతోంది?

రాబిస్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను నాశనం చేసే ప్రాణాంతక వైరల్ వ్యాధి. మెదడు, వెన్నుపాముపై దాడి చేస్తుంది. ఈ వ్యాధి అనేది సాధారణంగా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. బాలిలో, కోతులు, వీధి కుక్కలు రాబిస్ వైరస్ ప్రధాన వాహకాలుగా కొనసాగుతున్నాయి. పర్యాటక ప్రాంతాలలో కోతులు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు వాటితో సరదాగా ఆడుకుంటారు. వాటికి ఆహారం అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు అవే కోతులు రాబిస్ వ్యాధిని విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన పలు దేశాలు  

బాలిలో రాబిస్ భయపెడుతున్న నేపథ్యంలో అమెరికా తమ ప్రయాణీకులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతంలో ఎక్కువ సమయం గడపకపోవడం మంచిదని సూచించింది.  యూకే కూడా తమ పౌరులకు హెచ్చరికలు చేసింది. రాబిస్ గురించి తెలుసుకోవడంతో పాటు తమకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కుక్క, కోతి లాంటి జంతువులు కరిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలన్నది. ఆస్త్రేలియా కూడా తమ దేశీయులకు కీలక సూచనలు చేసింది. కోతులు, కుక్కలకు దూరంగా ఉండటం మంచిదని తెలిపింది.

రాబిస్‌ ను ఎదుర్కోవడానికి బాలి ప్రయత్నాలు

బాలిలో రాబిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక అధికారులు వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఉబుద్‌ లోని సేక్రెడ్ మంకీ ఫారెస్ట్ లాంటి పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీధి కుక్కలకు రేబిస్ టీకాలు వేస్తున్నారు. కోతులను పర్యాటకుల దగ్గరికి రాకుంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకులకు రేబిస్ గురించి తెలిసేలా తగిన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కోతులు, కుక్కలకు ఫుడ్ వేయడం, ఆడుకోవడం లాంటివి చేయకూడదంటున్నారు.

Read Also: పిల్ల సైంటిస్టులు.. డ్రింక్ బాటిల్స్‌తో రాకెట్.. గాల్లోకి ఎలా దూసుకెళ్లిందో చూడండి!

రాబిస్ నుంచి తప్పించుకోవాలంటే ఎలా?

బాలికి వెళ్లే పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచించారు. వీధి కుక్కలు, పిల్లులు, కోతులను తాకకూడదన్నారు. ఒకవేళ కరిచితే వెంటనే వైద్య సాయం పొందాలన్నారు. ఎక్కువ కాలం బాలిలో ఉండేవారు రాబిస్  వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదన్నారు.

Read Also: భూమిలోకి కుచించుకుపోతున్న న్యూయార్క్ నగరం.. అమెరికాలో భయాందోళనలు!

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×