BigTV English

Asthma: ఆస్తమా రోగులు వర్షాకాలంలో.. తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Asthma: ఆస్తమా రోగులు వర్షాకాలంలో.. తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Asthma: వర్షాకాలం అందరికీ ఉపశమనం కలిగించినప్పటికీ.. ఆస్తమా రోగులకు ఇది అనేక సవాళ్లను కలిగిస్తుంది. వాతావరణంలో పెరిగిన తేమ, బూజు అంతే కాకుండా ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు శ్వాస సమస్యలను పెంచుతాయి. ఇలాంటి పరిస్థితిలో.. ఆస్తమా రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం , వారి దినచర్యలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


తేమ నుంచి రక్షణ:
వర్షాకాలంలో.. వాతావరణంలో తేమ చాలా పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తులకు హానికరం కావచ్చు. అంతే కాకుండా ఇంటి లోపల తేమ బూజు , ధూళి కణాల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇది ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఇంటిని పొడిగా, శుభ్రంగా, మంచి గాలితో ఉంచడానికి ప్రయత్నించండి. డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించండి లేదా ఫ్యాన్లు, ఎగ్జాస్ట్‌లను వాడండి.

ఇండోర్ క్లీనింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి:
వర్షాకాలం ఇంట్లో తేమ, దుమ్మ, ఫంగల్ ఇన్ఫెక్షన్లను పెంచుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నేలలు, కర్టెన్లు, కార్పెట్లi, పరుపులను శుభ్రం చేయండి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత దిండ్లు లేదా పరుపులలో పేరుకుపోయిన దుమ్ము కూడా ఆస్తమాను తీవ్రతరం చేస్తుంది. కాబట్టి వాటిని మార్చండి.


వేడి, చల్లని వస్తువులను నివారించండి:
వర్షంలో తడవడం, చల్లటి నీరు తాగడం లేదా చల్లటి పదార్థాలు తినడం వల్ల ఆస్తమా తీవ్రమవుతుంది. అందుకే శరీరాన్ని పొడిగా, వెచ్చగా ఉంచండి. బయటి నుంచి వచ్చిన వెంటనే బట్టలు మార్చుకుని తడి జుట్టును ఆరబెట్టండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. అంతే కాకుండా సూప్ వంటి వెచ్చని పదార్థాలను కూడా తినండి.

ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండండి:
వర్షాకాలంలో వైరల్ , బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆస్తమా రోగులకు మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం, డాక్టర్ సూచించిన మందులను సకాలంలో తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

మీ మందులను మర్చిపోకండి:
ఇన్హేలర్ లేదా నెబ్యులైజర్ వంటి మందులను ఎల్లప్పుడూ మీతో ఉంచుకోండి. తరచుగా.. వాతావరణంలో మార్పు కారణంగా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో వెంటనే మందులు తీసుకోవడం అవసరం అవుతుంది. డాక్టర్ ఇచ్చిన మందుల మోతాదును దాటవేయకండి. అంతే కాకుండా క్రమం తప్పకుండా చెక్ చేయించుకుంటూ ఉండండి.

యోగా, శ్వాస వ్యాయామాలు :
ప్రాణాయామం, భ్రమరి, అనులోమ-విలోమ వంటి యోగా వ్యాయామాలు ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అవి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఇది ఆస్తమాను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Also Read: ఉదయం పూట పొరపాటున కూడా ఈ ఫుడ్స్ తినొద్దు !

సూర్య స్నానం చేయండి:
వర్షాకాలం విటమిన్ డి లోపానికి కారణమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఎండ ఉన్నప్పుడల్లా.. కాసేపు బయట కూర్చోండి. ఇది శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఉబ్బసం లక్షణాలను కొంతవరకు తగ్గిస్తుంది.

ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ:
సీజనల్ ఫ్రూట్స్ , కూరగాయలు తినండి. కానీ అరటిపండు, పెరుగు లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వంటి శ్లేష్మం పెంచే వాటిని నివారించండి. పసుపు పాలు, తులసి-తేనె కషాయం లేదా అల్లం టీ తీసుకోవడం ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

Related News

Stone Baby: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!

Kissing Bug: కిస్సింగ్ బగ్.. అమెరికాను వణికిస్తున్న ఈ కీటకం.. ఏం చేస్తుందో తెలుసా?

Caffeine-Dreams: ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Brain Eating Amoeba: కేరళలో మెదడు తినేసే అమీబా.. 8 రోజుల్లో నలుగురు మృతి

Afternoon sleeping effects: మధ్యాహ్నం పూట తినగానే పడుకుంటే ఏం జరుగుతుంది?

Weight Loss: జిమ్‌కు వెళ్లలేదు, డైటింగ్ చెయ్యలేదు.. ఏకంగా 40 కిలోలు తగ్గాడు.. అదెలా?

×