Amrit Bharat Express in AP: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇప్పుడో మంచి శుభవార్త. బెంగళూరులోని SMVT స్టేషన్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్ వరకు నడిచే 13433 నంబర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా వెళుతోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే వారికి ఇది ఒక సరికొత్త ప్రయాణ అనుభవం కలిగించే అవకాశం దరిచేరనుంది. ఈ రైలు రాత్రివేళ విజయవాడ చేరుకొని, తెల్లవారుజామున విశాఖ చేరేలా జర్నీ సాగిస్తుంది. త్వరితగతిన దూసుకెళ్తూ, కనీస స్టాపులతో ముందుకు సాగుతుంది. తక్కువ టైంలో, ప్యాక్డ్ ఫీచర్లతో ఉన్న ఈ ట్రైన్ ప్రయాణం ఒక ఫస్ట్ క్లాస్ అనుభూతిని ఇస్తుంది.
ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (13433) బెంగళూరులోని SMVT స్టేషన్ నుంచి ప్రారంభమై, మాల్దా టౌన్ వరకు నడుస్తుంది. అయితే మధ్యలో కొన్ని ముఖ్యమైన స్టేషన్ల వద్ద మాత్రమే ఆగుతుంది. వాటిలో ఏపీలోని ఒంగోలు (OGL), తెనాలి (TEL), విజయవాడ (BZA), తాడేపల్లిగూడెం (TDD), రాజమండ్రి (RJY), విశాఖపట్నం (VSKP). ఈ రైలు దాదాపు 8 గంటల వ్యవధిలో విజయవాడ నుంచి విశాఖ చేరవచ్చు. రెగ్యులర్ ట్రైన్లతో పోలిస్తే ఇది చాలా వేగంగా విశాఖకు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ స్టైల్ కూడా ప్రత్యేకమే. భారతీయ రైల్వేలో పుష్-పుల్ టెక్నాలజీతో నడిచే ఇది ఒక ఆధునిక రైలు. రెండు వైపులా ఇంజిన్లు ఉండటం వల్ల స్టార్ట్, స్టాప్‌లలో సమయం నష్టపోకుండా వేగంగా నడవగలుగుతుంది. దీనికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన డెక్కర్, మరిన్ని సౌకర్యాలు కలిగిన కోచ్‌లు, ప్యాంట్రీ కార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. శుభ్రమైన ఇంటీరియర్, మంచి కుర్చీలు, ఆధునిక లైటింగ్, లగేజ్ రాక్స్.. ఇవన్నీ ప్రయాణికులకు ప్రీమియం అనుభవం కలిగిస్తాయి.
ఒంగోలు, తుని, విజయవాడ, విశాఖపట్నం వంటి ఏపీ స్టేషన్ల మీదుగా వెళ్లే ఈ రైలు ప్రస్తుతం వారానికి మూడు రోజులపాటు నడుస్తోంది. ఇక విశాఖపట్నం నుంచి ఎవరైనా బెంగాల్ వెళ్లాలన్నా, మధ్యప్రదేశ్, ఒడిశా వెళ్లాలన్నా ఈ ట్రైన్ చాల మంచిదిగా ఉపయోగపడుతుంది. ఒక వేళ బెంగళూరు నుంచి ఏపీ మీదుగా ప్రయాణించాలనుకునేవారికి ఇది ఒక స్పెషల్ రూట్ అవుతుంది.
ప్రస్తుతం బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. IRCTC వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సామాన్య రిజర్వేషన్ టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఇక ఫ్యామిలీ ట్రిప్, ఆఫీషియల్ ట్రిప్, విద్యార్థుల ప్రయాణం, లేదా ఏపీ టూరిజం పర్యటనల కోసం కూడా ఇది మంచి ఛాయిస్. అందువల్ల విజయవాడ నుంచి విశాఖ దాక ప్రయాణం చేయాలనుకునే వారు తప్పకపోయినా ఒక్కసారి ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని అనుభవించండి. వేగంగా, ఆనందంగా, సురక్షితంగా ప్రయాణించడమంటే ఇదే. రాత్రి విజయవాడలో ఎక్కి, తెల్లవారేసరికి విశాఖలో ఉన్న బీచ్ అందాలను ఆస్వాదించే స్పెషల్ ట్రైన్ ఇదే. అయితే కొసమెరుపు ఏమిటంటే.. కేవలం విజయవాడ నుండి విశాఖకు మరో అమృత్ భారత్ ట్రైన్ త్వరలోనే రానుందని సమాచారం.