World Will End 2026: 2026 నవంబర్‌లో ’13వ తేదీ శుక్రవారం’ ప్రపంచం అంతం కాబోతుందని కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇది కచ్చితంగా డూమ్స్‌డే ను సూచిస్తుందని కొందరు వాదిస్తున్నారు. 1960లో ప్రచురితమైన గణిత సమీకరణాలను అంచనా వేసి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తు్న్న పర్యావరణ మార్పులు, భూమి వేగాన్ని అంచనా వేసి.. యుగాంతం వస్తుందని ఓ సమీకరణాన్ని రూపొందించారు.
ఈ సమీకరణాన్ని 1960లో ఇల్లినాయిస్ వర్సిటీకి చెందిన హీన్జ్ వాన్ ఫోయెర్స్టర్, ప్యాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమియోట్ అనే పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీరి పరిశోధన దాదాపు రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలపై జరిగింది. ఈ డేటాను ఆధారం చేసుకుని ఓ నమూనాను రూపొందించారు. జనాభా పెరుగుదల రేటు భారీగా పెరగడంతో… అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా పెరుగుదల నిరవధికంగా కొనసాగితే చివరికి వనరులు కొరవడి విస్పోటనంగా మారుతుందని వీరి పరిశోధనలో అంచనా వేశారు.
రెండు ప్రపంచ యుద్ధాలు జరిగి భారీగా ప్రాణనష్టం జరిగినప్పటికీ, ప్రపంచ జనాభా బాగా పెరిగిందని పరిశోధకులు అంచనా వేశారు. 1900-1960 మధ్య ప్రపంచ జనాభా 1.6 బిలియన్ల నుండి 3 బిలియన్లకు పెరిగింది. వైద్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయంలో వస్తున్న మార్పులతో.. మరణాల రేటును గణనీయంగా తగ్గించింది. అనేక దేశాల్లో జననాల రేటు పెరిగింది. పరిశోధకులు.. జనాభా పెరుగుదలలో అసమానతలను గుర్తించారు. జనాభా డేటా ఆధారంగా గణిత సూత్రాన్ని రూపొందించారు. ఈ మేరకు శుక్రవారం 13వ తేదీ నవంబర్ 2026న జనాభా పెరుగుదల యుగాంతానికి సంకేతమని పరిశోధకులు అంచనా వేశారు.
అయితే సాధారణంగా పరిశోధకులు నమ్మేది వాస్తవంగా జరుగుతుందని చెప్పలేం. శాస్త్రవేత్తలు యుగాంతం జరుగుతుందని అంచనా వేయలేదు. అందుకు బదులుగా, తీవ్రమైన జనాభా పెరుగుదల.. ప్రజల జీవనోపాధి అవకాశాలను తగ్గిస్తుందని హెచ్చరించారు. అధిక జనసాంద్రత, వనరుల తగ్గిపోవడం, పర్యావరణ మార్పులతో మానవాళి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. జనాభా పెరుగుదలను అదుపు చేయకపోతే ఆకలితో అలమటించక తప్పదని, పర్యావరణ సమస్యలతో మానవాళి నలిగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు పైగా చేరుకుంది. అనేక దేశాల్లో సామాజిక, ఆర్థిక, విద్యా మార్పుల కారణంగా ప్రజలు తక్కువ మంది పిల్లలను కంటున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. ప్రపంచ జనాభా క్రమంగా తగ్గుదల ప్రారంభం అయ్యే ముందు.. 2080లలో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని తెలిపింది.
Also Read: జపనీయులు నిద్రపోయేది 6 గంటలే.. కానీ అంత ఆరోగ్యంగా ఎలా ఉంటారో
జపాన్ టోహో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, NASA పరిశోధకులతో కలిసి పనిచేస్తూ.. సూర్యుడు, భూమి వాతావరణం భవిష్యత్తు పరిణామాన్ని అధ్యయనం చేశారు. వారి సమీకరణాల మేరకు సుమారు ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత.. భూమి విపరీతంగా వేడెక్కి..వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందని, మహాసముద్రాలు ఇంకిపోతాయని అంచనా వేశారు.