E-Paper
Advertisement

ఇథియోపియా మహిళ అరుదైన రికార్డు.. ఒక బిడ్డ కోసం వేడుకుంటే.. ఐదుగురు బిడ్డలతో మురిపించిన అదృష్టం!

ఇథియోపియా మహిళ అరుదైన రికార్డు.. ఒక బిడ్డ కోసం వేడుకుంటే.. ఐదుగురు బిడ్డలతో మురిపించిన అదృష్టం!
Advertisement

Natural Quintuplets: నిరీక్షణ ఎంత భారంగా ఉన్నా, దానికి లభించే ప్రతిఫలం అంతకంటే అద్భుతంగా ఉంటుందని ఇథియోపియాలోని హరారీ ప్రాంతానికి చెందిన బెద్రియా అడెమ్ ఉదంతం నిరూపించింది. పెళ్లయిన 12 ఏళ్ల పాటు సంతానం కోసం ఆమె పడని వేదన లేదు, చేయని ప్రార్థన లేదు. అయితే, విధి ఆమెకు ఒకేసారి ఐదుగురు బిడ్డలను (క్వింటుప్లెట్స్) బహుమతిగా ఇచ్చింది. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి జన్మనిచ్చిన ఆమె, ఇప్పుడు తన సంతోషాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదని ఆనందబాష్పాలతో చెబుతున్నారు.

వైద్య చరిత్రలో అద్భుతం.. కృత్రిమ పద్ధతులు లేకుండానే..
సాధారణంగా ఐవీఎఫ్ (IVF) వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కానీ, బెద్రియా విషయంలో అసలు అద్భుతం ఇక్కడే ఉంది. ఎటువంటి వైద్య సహాయం లేకుండా, సహజ సిద్ధంగానే ఆమె గర్భం దాల్చారు. వైద్య శాస్త్రం ప్రకారం, ఇలా సహజంగా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం 5.5 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుంది. హివోట్ ఫానా స్పెషలైజ్డ్ ఆసుపత్రిలో జరిగిన ఈ అరుదైన ప్రసవం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

Advertisement

నలుగురు అనుకుంటే ఐదుగురు!
గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకున్న బెద్రియాకు, తన కడుపులో నలుగురు బిడ్డలు ఉన్నారని వైద్యులు మొదట చెప్పారు. దానికి మానసికంగా సిద్ధమైన ఆమెకు, ప్రసవ సమయంలో మరో సర్ ప్రైజ్ ఎదురైంది. సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్న తరుణంలో వైద్యులు ఐదో శిశువును కూడా గుర్తించి సురక్షితంగా బయటకు తీశారు. “నేను ఒక్క బిడ్డ కోసం భగవంతుడిని వేడుకుంటే, ఆయన నాకు ఐదుగురిని ప్రసాదించారు” అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

శిశువుల ఆరోగ్యంపై వైద్యుల భరోసా
పుట్టినప్పుడు ఈ ఐదుగురు శిశువులు 1.3 నుంచి 1.4 కిలోల బరువు ఉన్నారు. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన ప్రసవాల్లో శిశువుల బరువు తక్కువగా ఉండటం సహజమే. అయితే, కిలో కంటే ఎక్కువ బరువున్న పిల్లలు ఆరోగ్యంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ నూర్ అబ్దుల్లాహి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

మానసిక వేదన నుంచి మహోన్నత ఆనందానికి..
సంతానం లేని కారణంతో గత పన్నెండేళ్లుగా బెద్రియా ఎంతో సామాజిక ఒత్తిడిని, మానసిక వేదనను అనుభవించారు. ఆ కష్టాలన్నింటినీ మర్చిపోయేలా ఇప్పుడు ఆమె ఇల్లు ఐదుగురు పసికందుల కిలకిలరావాలతో కళకళలాడుతోంది. ప్రసవం తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంగా ఉండటం చూసి వైద్య బృందం కూడా ఆశ్చర్యపోతోంది. బెద్రియా దంపతుల పట్టుదల, విశ్వాసానికి దక్కిన ఈ గౌరవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో దంపతులకు స్ఫూర్తినిస్తోంది.

Also Read: ఛీ, యాక్.. మటర్ పనీర్ చెరకు రసం, ఎలా వస్తాయ్ రా ఇలాంటి చెత్త ఐడియాలు?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×