Viral Story: గతంలో సాఫ్ట్ వేర్ గా పనిచేసిన ఓ మహిళ.. ప్రస్తుతం ఆటో నడుపుతున్న ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఐటీ జాబ్ లోని ఒత్తిడి, అధిక పనిగంటలు తట్టుకోలేక.. ఈ విభిన్నమైన వృత్తిని ఎంచుకున్నట్లు సదరు మహిళ పేర్కొంది. ప్రస్తుతం తన జీవితం ఎంతో హాయిగా ఉందని.. నెలకు సంపాదన కూడా బాగానే వస్తోందని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
డాక్టర్ నెజ్రిన్ మద్లాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో సదరు మహిళ గురించి వీడియోను పోస్ట్ చేసింది. తాను ఆటో నడుపుతున్న మహిళను కలిసానని.. ఆమె చెప్పింది విన్నాక షాక్ కు గురయ్యాయని తెలిపారు. ఆ మహిళా ఆటో డ్రైవర్.. గతంలో 9 ఏళ్ల పాటు ఐటీ మేనేజర్ గా పనిచేశారని అన్నారు. కానీ ఉద్యోగంలోని ఒత్తిడి, టెన్షన్స్ భరించలేక ఆమె ఇలా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారని తెలిపారు.
Also Read: గ్రహాల బలం.. రాహుల్ అపాయింట్‌మెంట్.. డీకేకి భలే కలిసొచ్చిందే!
ప్రస్తుతం సొంత ఆటో నడుపుకుంటా హాయిగా ఆమె జీవిస్తున్నట్లు నెటిజన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆటో నడపడం ద్వారా రూ.60,000 వరకూ సంపాదిస్తున్నట్లు చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సంతోషంగా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా జీవితాన్ని అస్వాదించగలుగుతున్నట్లు ఆమె చెప్పిందని రాసుకొచ్చారు. ప్రతీ మనిషి సక్సెస్ స్టోరీ ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదని.. ఆమెతో జరిగిన సంభాషణ గొప్ప అనుభూతిని పంచిందని డాక్టర్ నెజ్రిన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ తో మాట్లాడిన దృశ్యాలను సైతం తన పోస్టుకు జత చేశారు.
Also Read: జియో యూజర్లకు షాక్.. మాయమైన బడ్జెట్ ప్లాన్లు.. అసలేం జరిగిందంటే?