BigTV English

Fake Baba in Vikarabad: ఇంద్ర సీన్ రిపీట్.. సీన్ కట్ చేస్తే.. వీళ్లు చాలా కంత్రీ బేటా

Fake Baba in Vikarabad: ఇంద్ర సీన్ రిపీట్.. సీన్ కట్ చేస్తే.. వీళ్లు చాలా కంత్రీ బేటా

Fake Baba in Vikarabad: ఏంటండీ ఈ అరాచకం. జనాలు సినిమాలు చూడట్లేదా? దొంగ సాధువుల మోసాలపై బోల్డెన్నీ సినిమాలు వస్తున్నాయి. అయినా జనాల్లో అవగాహన రాదా? లేక అత్యాశతో వారి భ్రమల్లో పడుతున్నారా?


మెగాస్టార్‌ చిరంజవి ఇంద్ర సినిమాలో గంగా నది దగ్గర బ్రహ్మానందం, MS నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ వేరే లెవల్‌ అసలు. బంగారం రెట్టింపు చేస్తామని.. ఓ అమాయక ఫ్యామిలీని బురిడీ కొట్టిస్తారు. గంగానదిలో బంగారం మూట వేసి తీశాక.. తాను చెప్పేంత వరకు ఓపెన్‌ చేయోద్దని చెప్పి. బోల్తా కొడతారు. తీరా అత్యుత్సాహంతో ముందే ఓపెన్‌ చేసేస్తుంది ఆ ఫ్యామిలీ. ఇంకేముంది దాంట్లో మొత్తం రాళ్లు, రప్పలు చూసి షాకవుతారు. అయితే వికారాబాద్‌ జిల్లాలోనూ అలాంటి సీనే రిపీట్‌ అయింది.

నస్కల్‌లో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ యజమానికి దొంగ సాధువులు టోకరా వేశారు. భోజనం చేయడానికి వచ్చి ఆ యజమానికే సున్నం పుశారు. నీవు చాలా సమస్యలతో ఉన్నావు, నీకు మంచి జరగాలంటే తాము చెప్పినట్లు చెస్తే.. సమస్యలు తీరుతాయని నమ్మించారు. ఇంట్లో ఉన్న రాగి చెంబు తీసుకురమ్మని యజమానికి చెప్పారు. ఆ చెంబులో బంగారు ఉంగరం వేయాలని తెలపగా సరే అని ఉంగరాన్ని రాగి చెంబులో వేశాడు.


Also Read: దేవుడా.. ఏంటి చైనాలో కార్లు ఇలా అయిపోయాయి..

తెల్లబట్ట తీసుకురమ్మని యజమానిని ఇంట్లోకి పంపించి అతను వచ్చేసరికే ఈ దొంగ సాధువులు రాగి చెంబుకు తెల్లబట్ట చుట్టేశారు. మరుసటి ఉదయం వరకు చెంబు తెరవద్దని చెప్పారు. దీంతో అప్పటికి అనుమానం వచ్చిన యజమాని చెంబు తెరచి చూడగా అందులో రాయి ఉంది. వెంటనే అప్రమత్తమైన యజమాని స్థానికులతో కలిసి సాధువులను దేహశుద్ధి చేశారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×