BigTV English

Most Tattooed Woman: గిన్నీస్ రికార్డు కోసం నాలుకను రెండుగా చీల్చి దడుచుకునేలా తయారయ్యింది..

Most Tattooed Woman: గిన్నీస్ రికార్డు కోసం నాలుకను రెండుగా చీల్చి దడుచుకునేలా తయారయ్యింది..

Most Tattooed Woman: ఒక్కోక్కరికి ఒక్కో బుద్ధి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుంది. ఈ క్రమంలో ఫేమస్ అవ్వాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్నాలజీ కూడా విపరీతంగా పెరుగుతుండడంతో రికార్డులు సాధించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా గిన్నిస్ రికార్డులు సాధించే వారు మాత్రం అత్యధికం అవుతున్నారు. ఒక్కో వ్యక్తి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో గిన్నిస్ రికార్డులు సాధిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్న క్రమంలో ఒకరి కంటే ఒకరు రికార్డులు సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


గిన్నిస్ రికార్డు సాధించాలని ఓ యువతి ఏకంగా శరీరం అంతా పచ్చబోట్లు వేసుకుంది. ప్రపంచంలోనే ప్రత్యేక యువతిగా, ఒళ్లంతా పచ్చబోట్లు వేసుకున్న యువతిగా పేరుతో పాటు రికార్డు కూడా సాధించాలని అనుకుంది. ఈ క్రమంలో ఒళ్లంతా పచ్చబొట్టు పొడిపించుకుని గిన్నిస్ రికార్డు సంపాదించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఎస్పరెన్స్ లుమినెస్కా ఫ్యూయెర్ జినా అనే 36 ఏళ్ల వయసు గల యువతి ఈ రికార్డును సృష్టించింది. శరీరంలోని 99.98 శాతం పచ్చబొట్లను వేయించుకుంది.

ఒళ్లంతా టాటూలు వేసుకోవడమే కాదు దానికి ఓ పేరు కూడా పెట్టింది. చీకటిని అందంగా మార్చడం అనే థీమ్ పేరుతో ఈ సాహసం చేసింది. అయితే ఈ యువతి బ్రిడ్జ్ పోర్ట్ కు చెందింది. అంతేకాదు మాజీ ఆర్మీ ఉద్యోగి కూడా. ఈ మేరకు ఓ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. కేవలం పచ్చబొట్లు మాత్రమే కాదు నాలుకను కూడా రెండుగా చీల్చుకుంది. ఈ క్రమంలో చాలా రకాల విషయాలను కూడా వెల్లడించింది. తనకు ఎక్కడికి వెళ్లినా కూడా ఎన్నో జ్ఞాపకాలను తీసుకుని వెళ్లడం ఇష్టమని తెలిపింది. టాటూ అంటే తనకు ఎంతో ఇష్టమని అందువల్లే రికార్డు సంపాదించాలని ఈ సాహసం చేసినట్లు కూడా వెల్లడించింది. యువతి శరీరంపై ఉన్న టాటూలకు గిన్నిస్ రికార్డు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ మేరకు చివరికి ఆ యువతి రికార్డు సాధించింది.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×