E-Paper
Advertisement

Bhoot Vidya: ఆ యూనివర్సిటీలో ‘భూత వైద్యం’ కోర్సు.. ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్లు వచ్చాయంటే?

Bhoot Vidya: ఆ యూనివర్సిటీలో ‘భూత వైద్యం’ కోర్సు.. ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్లు వచ్చాయంటే?
Advertisement

BHU Bhoot Vidya Vigyan Course: ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో విశ్లేషణలు చేస్తే, ఎలాంటి పరిణామాలు ఎదురువుతాయనేది దానికి బెస్ట్ ఎగ్జాంఫుల్.. బనారస్ హిందూ యూనివర్సిటీ భూత వైద్యం కోర్సు. యూనివర్సిటీ ఆలోచన ఏంటి? అనేది పూర్తిగా పరిశీలించకుండానే మీడియా, సోషల్ మీడియా విశ్లేషకులు నానాయాగీ చేశారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లు వ్యవహరించారు. శాస్త్రసాంకేతికత ఆకాశానికి ఎదుగుతుంటే, భూతవైద్యం అంటూ దేశాన్ని తిరోగమనం బాటపట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇంతకీ అసలు యూనివర్సిటీ తీసుకొచ్చిన కోర్సు ఏంటి? అందులో బోధించే అంశాలు ఏంటి? అనేది తెలుసుకోకుండానే అసత్యాలు, అర్థసత్యాలను ప్రచారం చేశారు. ఫలితంగా ఓ మంచి ఆలోచనతో తీసుకొచ్చిన కోర్సు అగమ్యగోచరంగా మారింది. ఇంతకీ భూత వైద్యం కోర్సు ఉందా? ఉంటే ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్లు వచ్చాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంతకీ ఏంటీ భూత విద్య?  

భూత విద్య అనేది ఆయుర్వేద వ్యవస్థలోని అష్టాంగ ఆయుర్వేదలో ఓ భాగంగా కొనసాగుతోంది. సాంప్రదాయకంగా మానసిక రుగ్మతలు, సైకోసోమాటిక్ డిసార్డర్స్ అంటే మనసు, శరీర సంబంధిత వ్యాధులు, అనిశ్చిత కారణాలతో వచ్చే మానసిక సమస్యలను అధ్యయనం చేస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్లు  మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని నయం చేసేందుకు ప్రయత్నిస్తారు.

2019లో ఏం జరిగింది?  

Advertisement

2019లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఆయుర్వేద ఫ్యాకల్టీ 6 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది.  జనవరి 2020 నుంచి ఈ కోర్సు మొదలవుతుందని ప్రకటించింది. ఈ కోర్సు ప్రధానంగా ఆయుర్వేద గ్రాడ్యుయేట్లు(BAMS), MBBS లాంటి డాక్టర్లకు ఉద్దేశించబడింది. ఇందులో సైకోథెరపీ, ఆయుర్వేదిక్ రెమెడీస్, మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స, ముఖ్యంగా భూతగ్రస్తులు అని భావించే వారికి మానసిక ప్రశాంతత తీసుకురావడం ఎలా అనే అంశాన్ని నేర్పిస్తారు. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కోర్సు కోసం అప్పట్లో.. యూనివర్సిటీలో ప్రత్యేక భూత విద్య యూనిట్ కూడా ఏర్పాటు చేసింది.

ఎందుకు ఈ కోర్సు వివాదం అయ్యింది?  

ఈ కోర్సు గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిజా నిజాలు తెలుసుకోకుండా వార్తా కథనాలు ప్రచురించాయి. ఘోస్ట్ స్టడీస్ అంటూ సెన్సేషనల్ రిపోర్ట్స్ చేశాయి. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. కొంతమంది ఈ కోర్సును పెట్టడం అంటే మూఢ నమ్మకాలను ప్రోత్సహించడమేనని చెప్పుకొచ్చారు. BHU అధికారులు ఈ కోర్సు ఉద్దేశం ఏంటని క్లారిటీగా వివరించే ప్రయత్నం చేశారు. భూతాలను వదిలించే మాంత్రిక చికిత్స కాదని, మానసిక రుగ్మతలు గురించి ఆయుర్వేద దృక్పథంలో అర్థం చేసుకోవడంతో పాటు, చికిత్స చేస్తారని చెప్పారు. కానీ, మీడియా మసాలా కథనాల ముందు, వారు చెప్పే మాటలను ఎవరూ పట్టించుకోలేదు.

ప్రస్తుతం ఆ కోర్సు ఉందా? లేదా?  

Advertisement

ప్రస్తుతం ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు ఏవీ అందుబాటులో లేవు. 2019లో వివాదం అయిన తర్వాత, ఈ కోర్సు పూర్తిగా రద్దయిందా? కొనసాగుతోందా? అనేది స్పష్టంగా తెలియదు. కొన్ని సోర్సెస్‌ లో సిలబస్ ఇంకా ఉందని కనిపిస్తుంది. కానీ, అంతగా ప్రచారం లేదు. BHUలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విభాగాలు (Department of Psychiatry, Ayurveda Manovigyan) కొనసాగుతున్నాయి. భూతవిద్య అనేది ఆయుర్వేదంలో ఒక శాస్త్రీయ భాగం. ఆధునిక వైద్యంలో దీన్ని సైకియాట్రీ లేదంటే క్లినికల్ సైకాలజీగా పిలుస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద, ఆధునిక దృక్పథంతో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కోర్సును తీసుకొచ్చారు. కానీ, మీడియా, సోషల్ మీడియా అనవసర రచ్చ కారణంగా కనుమరుగైంది.

Read Also: విద్యార్థులూ ప్రేమలో పడండి.. ఆ యూనివర్శిటీ ప్రకటనపై అంతా షాక్, కారణం ఇదేనట!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×