BigTV English

Google: గూగుల్ దయ.. ఇంట్లో నగ్నంగా పోలీస్ అధికారి, రూ.10 లక్షలు జరిమానా!

Google: గూగుల్ దయ.. ఇంట్లో నగ్నంగా పోలీస్ అధికారి, రూ.10 లక్షలు జరిమానా!

గూగుల్ మరోసారి చిక్కుల్లో పడింది. దాని పొరపాటుకు భారీ మూల్యూమే చల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏకంగా రూ.10 లక్షలు.. సమర్పించుకోవల్సి వచ్చింది. అది కూడా ఓ పోలీస్ అధికారికి. అదెలా? గూగుల్‌ వల్ల ఆ పోలీసుకు ఎలాంటి నష్టం జరిగిందా అనుకుంటున్నారా? ఏం జరిగిందో తెలిస్తే తప్పకుండా నవ్వుకుంటారు.


ఆయనేమో అలా.. గూగుల్ ఏమో ఇలా..

ఇదంతా గూగుల్ స్ట్రీట్ వ్యూ వల్ల వచ్చిన తలనొప్పి.. అసలు ఏం జరిగిందో తెలియాలంటే.. 2017లోకి వెళ్లాలి. వన్ ఫైన్ డే.. గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా వాహనం అర్జింటినాలో ఓ చిన్న నగరంలోని వీధుల్లో తిరుగుతూ.. పరిసరాలను క్యాప్చర్ చేసే పనిలో నిమగ్నమైంది. తెలియకుండానే.. ఓ పిచ్చి పని చేసింది. అదే వీధిలో ఉంటున్న పోలీస్ అధికారి.. తన గార్డెన్‌లో బట్టలు లేకుండా వాకింగ్ చేస్తుంటే.. క్లిక్ అనిపించింది. గూగుల్ సిబ్బంది కూడా ఆ తప్పిదాన్ని గుర్తించలేకపోయారు. దాన్ని గూగుల్ మ్యాప్‌లోకి అప్‌లోడ్ చేశారు.


వైరల్ చేసిన తుంటరిగాళ్లు…

గూగుల్ స్ట్రీట్ వ్యూలోకి వెళ్తే చాలా చిత్రాలు కనిపిస్తుంటాయి. ఖాళీగా ఉండే కొంతమంది తుంటరిగాళ్లు ఎక్కువగా స్ట్రీట్ వ్యూలో కనిపించే విచిత్రాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. వాళ్లకు ఆ పోలీస్ అధికారి గార్డెన్‌లో బట్టలు లేకుండా తిరుగుతున్న ఫొటో దొరికింది. ఇంకేముంది.. దాన్ని వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. అయితే, అందులో ఆ పోలీస్ అధికారి ముఖం స్పష్టంగా కనిపించకపోయినా.. అతడి అడ్రెస్ తెలిసిపోయింది. ఎందుకంటే.. ఆ గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా అతడి ఇంటి నెంబర్‌ను కూడా క్యాప్చర్ చేసింది. దీంతో అతడి పరువు పోయింది.

కోర్టులో చుక్కెదురు..

తనకు జరిగిన అవమానానికి గూగుల్ తప్పకుండా పరిహారం చెల్లించాలంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టే అతడికి తిరిగి చివాట్లు పెట్టింది. ఎవడైనా అలా ఆరుబయట బట్టలు లేకుండా తిరుగుతాడా? అని గడ్డి పెట్టింది. అయినా.. మనోడికి కోపం చల్లారలేదు. తన పరువును వీధిలోకి లాగిన గూగుల్‌ను కూడా రోడ్డు మీదకు లాగుతానని సపథం పన్నాడు. దీంతో పైకోర్టును సంప్రదించాడు.

Also Read: కలుషితాలను తిని 24 క్యారెట్ల బంగారాన్ని ఉమ్మేసే వింత జీవి ఇదిగో

గూగుల్ వివరణ ఇదే..

సాధారణంగా గూగుల్ స్ట్రీట్ వ్యూ తప్పు చేయదని, మనుషుల ముఖాలను దానికదే బ్లర్ చేస్తుందని ఆ సంస్థ తరపు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. అయితే, ఆ పోలీస్ అధికారి ఇంటి ప్రహారి గోడ 6.6 అడుగులు మాత్రమే ఉందని.. దానివల్ల గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనంపైన అమర్చిన కెమేరా.. ఆ ఇంటి పరిసరాలను కూడా క్యాప్చర్ చేసిందని చెప్పారు. అది పొరపాటు మాత్రమేనని, వారి ప్రైవసీకి భంగం కలిగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ‘‘అయినా సరే.. అతడి పరువు పబ్లిక్ అయ్యింది. అతడి ముఖాన్ని బ్లర్ చేశారు.. కానీ, బాడీ మొత్తాన్ని చూపించేశారు కదా’’ అని న్యాయమూర్తులు క్లాస్ పీకారు. అతడికి జరిగిన పరువు నష్టానికి గాను వెంటనే 12,500 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.10,82,027) చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పారు. అలాగే ఆ ఫొటోలను వైరల్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×