ఇంతవరకు బంగారం భూమిలోనే దొరుకుతుందని మీకు తెలుసు. కానీ బంగారాన్ని తన పొట్టలోనే తయారు చేసి బయటకు ఉమ్మే ఒక వింత జీవి ఉంది. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంత ప్రమాదకరమైన విషపూరితమైన వాతావరణంలో కూడా ఈ జీవి బతకగలదు.
ఈ సూక్ష్మమైన జీవులు భూమిలోనే నివసిస్తాయి. విపరీతంగా కలుషితమైన లోహాలను తిని ఆపై వాటిని 24 క్యారెట్ల బంగారంగా మార్చి బయటికి ఉమ్మి వేస్తూ ఉంటాయి. అయితే చాలా చిన్న సూక్ష్మ పరిమాణంలో ఇవి బయటపడతాయి. కాబట్టి మన కంటికి కనిపించడం కష్టం.
ఈ జీవి పేరు ఏమిటి?
ఈ ప్రత్యేకమైన జీవి పేరు సి.మెటాలి డ్యూరాన్స్. దీనిని ఆస్ట్రేలియా, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విషపూరితమైన భారీ లోహాలను నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఈ సూక్ష్మజీవి జీవి సహజరక్షణ వ్యవస్థను ఉపయోగించుకుంటుందని పరిశోధనలో వెల్లడయింది. ఆ సహజ రక్షణ వ్యవస్థలో భాగంగానే ఈ విషపూరితమైన భారీ లోహాలను నెమ్మదిగా తినడం ప్రారంభిస్తుంది. తర్వాత దాని శరీరంలో చేరిన ఈ భారీ లోహాలను ఒక రసాయనం సక్రియం చేస్తుంది. అది బంగారంగా మారిపోతాయి. ఈ బంగారాన్ని ముక్కలుగా ఆ జీవి బయటకి ఉమ్మి వేస్తుంది. అందుకే ఈ జీవిని నడిచే బంగారు తయారీ కర్మాగారం అని చెప్పుకుంటారు.
ఈ సూక్ష్మజీవిని బ్యాక్టీరియా గానే చెబుతారు. దీన్ని మొదట 1976లో బెల్జియంలోని ఒక లోహ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో కనుగొన్నారు. పారిశ్రామిక వ్యర్ధాలలో ఈ బ్యాక్టీరియా జీవించడం మొదలుపెట్టింది. ఇతర జీవులు కనీసం జీవించలేని విషపూరితమైన వాతావరణంలో ఈ బ్యాక్టీరియా జీవించసాగింది. మైనింగ్ వ్యర్ధాలు, లోహాలతో కలుషితమైన నేల, పారిశ్రామిక వ్యర్ధ ప్రదేశాలలో ఉండే ఈ జీవి తాను కాపాడుకోవడం కోసం వాటిని తినడం మొదలుపెట్టింది. ఒక గ్రాము బరువుండే ఈ బ్యాక్టీరియా భారీ లోహాలైన రాగి, జింక్, క్యాడ్మియం, పాదరసం వంటివి తినేస్తుంది. ఆ లోహాలు అన్నిటినీ తిని బంగారంగా మార్చేస్తుంది.
ఈ ప్రత్యేకమైన జీవి జీవక్రియ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ జీవక్రియ క్లిష్టంగాను ఉంటుంది. ఘన లోహాలను కూడా తిని అరిగించుకుంటుందంటే దాన్ని జీవక్రియ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ జీవి శరీరానికి సహజంగా నిర్విషీకరణ చేసుకునే గుణం అధికంగా ఉంటుంది. దీనివల్లే ఇది పదార్థాలలోని విషాన్ని స్వీకరించినా కూడా ప్రభావితం కాకుండా ఉంటుంది. నేలలో కరిగిపోయిన హానికరమైన బంగారు అయాన్లతో కూడా ఇది చర్య జరిపి జీవిస్తుంది. భారీ లోహాలను తిన్న తర్వాత నానో పార్టికల్స్ రూపంలో 24క్యారెట్ల బంగారాన్ని బయటకి ఉమ్మి వేస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియాలను ఒకచోట పెంచుకుంటే విపరీతంగా బంగారం వచ్చే అవకాశం ఉంది. కానీ అవి తినడానికి రకరకాల లోహాలను సూక్ష్మ రూపంలో వాటికి అందించాలి. అందుకే వీటిని పెంచడం వంటివి ఎవరూ చేయరు.