Nirupam Paritala: సీరియల్ నటుడు నిరుపమ్ పరిటాల (Nirupam Paritala)అంటే బహుశా ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ కార్తీకదీపం (Karthika Deepam) కార్తీక్ లేదా డాక్టర్ బాబు అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకు వస్తారు. గత కొంతకాలంగా సీరియల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిరుపమ్ కు కార్తీకదీపం సీరియల్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఈ సీరియల్ లో డాక్టర్ పాత్రలో నటించిన ఈయనని అందరూ డాక్టర్ బాబుగా గుర్తు పెట్టుకున్నారు. ఇలా కార్తీకదీపం సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్స్ లో నటించడమే కాకుండా సీరియల్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా టీవీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న డాక్టర్ బాబు ఇటీవల కొత్త బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.
హైయెస్ట్ రెమ్యూనరేషన్..
ఇలా బుల్లితెర సీరియల్స్, కార్యక్రమాలు అంటూ బిజీగా గడుపుతున్న ఈయన ఒక్కో సీరియల్ కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్(Remuneration) తీసుకుంటారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిరుపమ్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈయన ఒక్కరోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తోంది. ఒకరోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే ఈయన సుమారు 40 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం. ఇప్పటివరకు సీరియల్స్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా నిరుపమ్ గుర్తింపు పొందారు.
కోట్లలో ఆస్తులు..
ఇక కార్తీకదీపం సీరియల్ తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోవడంతో ఇటీవల పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. నిరుపమమ్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆస్తులు కూడా భారీగా పోగు చేశారని తెలుస్తోంది. ఈయన నికర ఆస్తుల విలువ విషయానికి వస్తే…నిరుపమ్ కు హైదరాబాద్ లో సుమారు 80 లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన ఇల్లు ఉంది. ఈ ఇంటితో పాటు వైజాగ్ లో కూడా సుమారు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. వీటితోపాటు రెండు ఖరీదైన కార్లు కూడా తన గ్యారేజీలో ఉన్నట్టు సమాచారం. ఈ కార్లు విలువ కూడా కోట్లలో విలువ చేస్తాయని తెలుస్తోంది.
శ్రీవల్లి కలెక్షన్స్…
నిరుపమ్ మాత్రమే కాకుండా, ఈయన భార్య మంజుల కూడా పలు సీరియల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సీరియల్స్, బుల్లితెర కార్యక్రమాలలో మాత్రమే కాకుండా యూట్యూబ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఈ జంట ఆదాయం అందుకుంటున్నారు. ఇక తాజాగా శ్రీవల్లి కలెక్షన్స్ అంటూ మరొక కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు ఇటీవల ఈ జోడి తెలియచేశారు. ఏది ఏమైనా ఈ జోడీ బుల్లితెర నటీనటులుగా కొనసాగుతూ భారీ స్థాయిలో ఆస్తులు సంపాదించారని చెప్పాలి. ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.