BigTV English

Power of Government Job: ఏంటీ బ్రో ఇది.. ఇంత దారుణమా.. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలా!

Power of Government Job: ఏంటీ బ్రో ఇది.. ఇంత దారుణమా.. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలా!

Memes Government Employee Marriage: ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు పెద్దలు. ఈ మాట ఏ సందర్భంలో అన్నారో గాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఉద్యోగం ఉంటేనే పెళ్లిళ్లు అవుతున్నాయి అబ్బాయిలకు. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు.. అబ్బాయికి ఏమి ఉన్నా.. ఏమి లేకున్నా ఫర్వాలేదు. ఏమీ లేకపోయినా.. అంటే తప్పుడు ఆలోచనలు చేయొద్దు. రంగు, ఆకారం, నెత్తిమీత కాస్త బొచ్చు.


సాధారణంగా పెళ్లంటే ఒకప్పుడు అటేడుతరాలు, ఇటేడుతరాలు చేసేవారు. ఆ తర్వాతే పెళ్లికి సంబంధించిన పనులు మొదలువుతాయి. కానీ ఇప్పుడు అవేమి చూడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయి విషయంలో అయితే కళ్లు మూసుకుని అమ్మాయిని కట్టబెడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి తరఫున ఇచ్చే సమాధానం.. గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి అయితే మా అమ్మాయి జీవితం సెక్యూర్‌గా ఉంటుంది.

Read More : ఇదేక్కడి ప్రీ వెడ్డింగ్ షూట్ రా బాబు.. ఎక్కడా సూడలే..


మీకు తెలుసా అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిల తల్లిదండ్రులే కాదు.. అమ్మాయిలు కూడా పోటీ పడుతున్నారు. సర్కారీ నౌకరీ ఉన్న అబ్బాయి.. తెలుపా, నలుపా అన్నది అసలు ఖాతరు చేయడం లేదు. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆలస్యం చేయకుండా మీరు చూసి కడుపుబ్బా నవ్వుకోండి..!

సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ వీడియోస్ అనే ఐడి నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. అందులో చూస్తే ఓ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుంది. అందులో పెళ్లి కొడుకు బట్టతలతో ముందుకు వచ్చిన పొట్టతో.. తల మీద బొచ్చు లేకుండా ఉన్నాడు. అతని పక్కనే చందమామ లాంటి అమ్మాయి ఉంది. ఆ అబ్బాయి చూడటానికి అమావాస్య చంద్రుడిలా ఉన్నా.. పున్నమి వెన్నెలలా ఉన్న ఆ అమ్మాయి అతడిని ఇష్టపడటానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగమే. ఈ తతంగాన్ని చూసిన కొందరు మనలా నవ్వుకుంటూ వీడియో తీశారు. అలా ఆ వీడియా షేర్ అవుతూ.. వచ్చి సోషల్ మీడియాలో పడింది. ఇంకేముంది ట్రోల్స్ మీద ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.

Read More : 250 ఏళ్ల నాటి ప్రేమ లేఖలు.. నెట్టింట్లో వైరల్!

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైలెంట్‌గా ఎందుకు ఉంటారు. నాకు 35 సంవత్సరాలు నాకెందుకు కావడం లేదురా పెళ్లి. నాది ప్రైవేట్ జాబ్ నెలకు లక్ష జీతం నాకు కావడం లేదు పెళ్లి. నువ్వు.. నీ నెత్తి మీద నాలుగు ఎంట్రుకలు కూడా లేవు.. నీకెవర్రా పిలనిచ్చిందని విభిన్నంగా స్పందిస్తున్నారు. చూశారుగా లక్షలకు లక్షలు జీతాలొస్తున్నా.. పెళ్లికాని ప్రసాదులు ఎంతమందున్నారో. అమ్మాయిలూ కాస్త ఆలోచించండి.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×