BigTV English

Prithvi Shaw: పృథ్వీ షా..! భారత క్రికెట్‌లో అరుదైన ఘనత..

Prithvi Shaw: పృథ్వీ షా..! భారత క్రికెట్‌లో అరుదైన ఘనత..
Prithvi Shaw latest news

Prithvi Shaw Historic Record In Ranji Trophy(Sports news today): పృథ్వీ షా.. అంటే తెలియనివారుండరు. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ లగే తను కూడా ఇండియన్ క్రికెట్‌కు చుక్కానిలా నిలుస్తాడని అంతా అనుకున్నారు. తను కూడా 19 ఏళ్ల వయసులో ఇండియన్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 


టన్నుల కొద్దీ ప్రతిభ ఉన్నా గాయాలతో సతమతమవుతూ ఉన్నాడు. అవకాశాలు వచ్చినప్పుడు ఫామ్ లేకపోవడం, ఫామ్ ఉన్నప్పుడు అవకాశాల్లేకపోవడం, అన్నీ ఉన్నప్పుడు గాయాల పాలవడం ఇలా 24 ఏళ్ల పృథ్వీ షా జీవితంతో విధి ఆటలాడుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఆరు నెలల నుంచి గాయాలతో దూరంగా ఉన్న పృథ్వీ షా రీ ఎంట్రీతో చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా భారీ శతకం సాధించాడు. ఛత్తీస్‌గ‌‌ఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు. 107 బంతుల్లో సెంచరీని సాధించిన అతడు 159 పరుగుల వద్ద ఔటయ్యాడు. 18 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.


Read More: India Vs England: ఇంగ్లాండ్‌తో చివరి 3 టెస్టులు.. భారత్ జట్టు ఇదే..

దీంతో భారత క్రికెట్‌లో అరుదైన ఘనత నమోదు చేశాడు. తొలిరోజు లంచ్‌కు ముందే కెరీర్‌లో రెండు శతకాలు చేసిన క్రికెటర్‌గా కొత్త చరిత్ర స్రష్టించాడు. గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన ప్రథ్వీ రెండో అత్యధిక స్కోరు సాధించాడు. ఆ మ్యాచ్‌లో కూడా లంచ్‌కి ముందే సెంచరీ చేశాడు. ఇప్పుడు కూడా ఛత్తీస్‌ఘడ్ మ్యాచ్‌లో లంచ్‌కి ముందే సెంచరీ చేశాడు.

ఒకప్పుడు టీమ్ ఇండియాలో స్థానం కోల్పోయి, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌కి వెళ్లిన పృథ్వీ అక్కడ పరుగుల మీద పరుగులు చేశాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున  ఓ డబుల్ సెంచరీతో పాటు సెంచరీల మోత మోగించాడు. తిరిగి టీమిండియాలో చోటు దక్కుతుందనే సమయంలో గాయపడి ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడైనా పిలుపు రావాలని ఆశిద్దాం.

ప్రస్తుతం టీమ్ ఇండియాలో సీనియర్లు ఫామ్ లేకపోవడం, గాయాలతో జట్టులో లేకపోవడంతో ఇంగ్లాండ్‌తో పోరుకు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో రంజీట్రోఫీలో ఒకసారి టెస్ట్ జట్టులో ఆడిన క్రికెటర్లు స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. 

వారిలో పుజారా ఒకరు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ కూడా చేశాడు. అంతకుముందు డబుల్ సెంచరీ చేశాడు. తిలక్ వర్మ కూడా ఒక సెంచరీ చేసి సెలక్టర్ల పిలుపు కోసం రెడీగా ఉన్నాడు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×