BigTV English

250 Years Old Love Letters: 250 ఏళ్ల నాటి ప్రేమ లేఖలు.. నెట్టింట్లో వైరల్

250 Years Old Love Letters: 250 ఏళ్ల నాటి ప్రేమ లేఖలు.. నెట్టింట్లో వైరల్

250 Years Old Love Letters got Viral in Social Media: కాలం మారినా.. ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ లేఖలకు ఉండే క్రేజ్ ఎప్పటికీ మారదు. ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాయి కానీ.. ఒకప్పుడు మాట్లాడుకోవాలంటే ప్రేమ లేఖలే దిక్కు. ఆ ప్రేమ లేఖలను రాస్తుంటే వచ్చే కిక్కే వేరు. ప్రేమను తెలియజేయడానికి అనేక ప్రేమ లేఖలు రాసేవారు. వాటిని పంపించేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేసేవారు. ఆ లెటర్స్ అనుకున్న వారికి చేరేంత వరకు ఉండే ఆరాటం చెప్పలేనిది.


ప్రేమను తెలియజేయడానికి మనసులోని భావాలకు అక్షర రూపాన్ని కల్పించి ప్రేమ లేఖలు రాస్తుంటారు. అయితే తాజాగా కొన్ని ప్రేమ లేఖలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి మామూలు ప్రేమ లేఖలు కావు. దాదాపు 250 ఏళ్ల నాటి ప్రేమ లేఖలు. వాటిని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా? మరి లేట్ ఎందుకు చూసేద్దాం రండి..!

సుమారు 250 ఏళ్ల నాటి ఈ ప్రేమలేఖలు.. బ్రిటన్-ఫ్రాన్స్ యుద్ధ సమయంలో రాసినవిగా తెలుస్తోంది. ఈ యుద్ధం సుమారు ఏడేళ్లపాటు జరిగిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నావికాదళంలో పనిచేసే సైనికులకు ఈ ప్రేమ లేఖలు రాశారట. అయితే ఈ లేఖలు ఏవీ వారికి చేరలేదు. దీంతో బ్రిటీష్ నావికాదళం ఈ ప్రేమ లేఖలను స్వాధీనం చేసుకుంది. అసలు ఓపెన్ చేయని ప్రేమ లేఖలను తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ గుర్తించాడు. ఈ క్రమంలో ఆ ప్రొఫెసర్ వాటిని ఓపెన్ చేసి చదివే ప్రయత్నం చేశారు.


Read More: చాక్లెట్ డే.. మీ ప్రేమను తీయగా చేయండి..!

లేఖ లోపల ఎస్ఎమ్ఎస్ తరహాలో పదాలు ఉన్నాయి. “నీ ప్రేమను పొందాలని ప్రయత్నిస్తున్నాను. నీకు లేఖ రాస్తూ రాత్రి సమయం అంతా గడుపుతున్నాను. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ” ఉందంటూ లేఖల్లో రాసి ఉందని ప్రొఫెసర్ తెలిపారు. అంతే కాకుండా ఈ లేఖల్లో కొన్నింటిని చదువుతుంటే చాలా బాధ అనిపించిందని ప్రొఫెసర్ పేర్కొన్నారు. లేఖల్లో వారి ప్రేమతో పాటు.. జీవితంలో జరిగే సంఘటనలు, ఇంట్లో ఖర్చులు వంటి విషయాలు కూడా చర్చించారట. అయితే ఈ లేఖలు సైనికులకు చేరకపోవడం దురదృష్టకరం. వారికి చేరుంటే చాలా బావుండేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More: బిడ్డ కోసం కన్నీరు పెట్టుకున్న ఏనుగు..!

రోజులు మారుతున్నా ప్రేమ ఎప్పటికీ మారదు. అప్పటికీ.. ఎప్పటికీ అదే అనుభూతిని ఇస్తుంది. కానీ నేడు టెక్నాలజీ మాయలో పడి ప్రేమను, ప్రేమించిన వారిని చంపేస్తున్నాం. అందుకే ప్రేమలో పడిన ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడూ.. ప్రేమ లేఖలు రాయండి. మీ మనసులో ప్రేమ భావాలకు అక్షర రూపాన్ని ఇవ్వండి. ఆ అనుభూతిని ఒక్కసారి ఆస్వాదించండి..!

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×