Big Stories

Viral Video: అరే బుడ్డోడా ఏం గుండె రా నీది..వీడ్ని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Viral Video:ప్రమాదకరంగా 8 ఏళ్ల బాలుడు రైలు చక్రాల మధ్య ఇరుక్కుని వంద కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. చివరకు బాలుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే బాలుడి ధైర్యానికి పలువురు ఆశ్యర్యపోతున్నారు.

- Advertisement -

లక్నో నుంచి హర్దోయ్‌కి వెళ్తున్న గూడ్స్ రైలు ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగింది.స్టేషన్ సమీపంలోనే ఉంటున్న 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు. ట్రైన్ చక్రాల మధ్య కూర్చోగా ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో ఏమీ చేయలేక అలాగే వంద కిలో మీటర్లు ప్రయాణించాడు.

- Advertisement -

రైలు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత హర్దోయ్ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా..అక్కడ గూడ్స్ రైలును పరిశీలించిన ప్రయాణికులు అందులో బాలుడు ఉండడాన్ని గమనించారు. వెంటనే రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు.

Also Read:నా రూటే సెపరేటు.. నామినేషన్ ఫైల్ చేసేందుకు ఒంటెపై వెళ్లిన ఎంపీ అభ్యర్థి

బోగీల మధ్యలో చక్రాల నడుమ కూర్చొని ఉన్న బాలుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే బాలుడు ముఖానికి మొత్తం దుమ్ము, ధూళితో కనిపించాడు. అనంతరం ఆ బాలుడి వివరాలు తెలుసుకున్న అధికారులు చైల్డ్ కేర్ హోం కు తరలించారు. వంద కిలోమీటర్ల దూరం బాలుడు ప్రమాదకరంగా గూడ్స్ రైలుపై ప్రయాణించినట్లు తెలుసుకున్న పలువురు బుడ్డోడి గుండె ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News