BigTV English

Hijras Fighting: పొట్టు పొట్టు కొట్టుకున్న ట్రాన్స్ జెండర్లు.. చూస్తూ ఎంజాయ్ చేసిన జనాలు

Hijras Fighting: పొట్టు పొట్టు కొట్టుకున్న ట్రాన్స్ జెండర్లు.. చూస్తూ ఎంజాయ్ చేసిన జనాలు

Hijras Fighting: రోడ్డుపై దారుణంగా కొట్టుకున్న ట్రాన్స్ జెండర్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరందరూ బిక్షాటన విషయంలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన నంద్యాల్లో చోటు చేసుకుంది. భిక్షాటన విషయంలో నంద్యాలకు చెందిన హిజ్రా వర్గాల మద్య వివాదం గత కొంత కాలంగా కొనసాగుతోంది. ఆ క్రమంలో తాజాగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఒకరిపై మరొకరు కారం చల్లుకుంటూ.. రాళ్ళతో దాడులకు దిగారు. ఇక్కడ భిక్షాటన చేసుకునే హక్కు మాకంటే మాకే ఉందని.. రెండు వర్గాలుగా మారి నడిరోడ్డుపై కొట్టుకున్నారు.


ఈ హిజ్రాలు తీవ్రంగా కొట్లాడుకుంటూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా అటుగా వెళ్తున్న వారి దృష్టిని కూడా ఈ ఘటన ఆకర్షించింది. అయితే ఈ సంఘటన చూస్తున్న స్థానికులు వారిని ఆపడానికి ధైర్యం చేయలేదు. మాకెందుకులే అని దూరంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

నడిరోడ్డుపై ఇంత జరుగుతున్నా.. స్థానికులంతా ఆ ప్రాంతంలోకి చేరుకుని ఏం చేయాలో తెలియక సినిమా చూసినట్లు చూశారు. ఒకరిపై మరొకరు జుట్టు లాక్కుంటూ కొట్టుకున్నారు. దీంతో ఈ ఘర్షణ తీవ్రం కావడంతో చూపరులు బిక్కుబిక్కుమంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిజ్రాలు కొట్టుకున్న వీడియోలను అక్కడ ఉన్నవారు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలో వైరల్‌గా మారాయి. చుట్టుపక్కలవారు పోలీసుల సహాయం కోసం బలవంతంగా పిలిచే స్థాయికి పరిస్థితి వచ్చింది.


Also Read: వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో ఇరుక్కున్న ఐరన్ వాషర్.. డాక్టర్లు చేయలేనిది ఫైర్ ఫైటర్స్ చేశారు!

స్థానిక పోలీస్ అధికారులు త్వరగా స్పందించి సంఘటనా స్థలానికి  చేరుకున్నారు. వారికి పోలీసులు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏమి గాయాలు కాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×