Fire Fighters Surgery To Remove Iron Washer in Private Part | అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎగిసి పడే మంటలను ఆర్పడానికి తమ ప్రాణాన్ని ఫణాంగా పెడతారు అగ్నిమాపక సిబ్బంది. అయితే అందరూ అనుకున్నట్లు వీరు కేవలం ఇలా సాహసోపేతంగానే ప్రజలను కాపడడం లేదు.. క్లిష్టమైన ఇతర సమస్యల ఎదురైనప్పుడు కూడా వాటిని పరిష్కరించి మనిషి ప్రాణాలు కాపాడగలరని తాజా ఘటనతో నిరూపితమైంది. ఒక మనిషికి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యులు అతనికి వైద్యం చేయడానికి కొన్ని సార్లు శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఒక క్లిష్టమైన సమస్యలో చిక్కుకున్న వైద్యులకు అగ్నిమాపక సిబ్బంది కావాల్సి వచ్చింది. ఒక వ్యక్తికి సర్జరీ చేయాల్సి వస్తే. . అందుకోసం వైద్యులు.. అగ్నిమాపక సిబ్బంది సాయం తీసుకున్నారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
వివారల్లోకి వెళితే.. ఉత్తర కేరళలోని కన్హంగాడ్ జిల్లాలో ఓ ఆస్పత్రికి చెందిన వైద్యులు ఒక రోగికి సర్జరీ చేయాలని భావించారు. అందుకోసం అతనికి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. కానీ వారు ఆ సర్జరీ చేయలేక పోయారు. చాలాసేపు ఆలోచించాక సీనయర్ వైద్యులతో చర్చించి.. ఆ శస్త్ర చికిత్స చేయడానికి అగ్ని మాపక సిబ్బంది సాయం చేయగలిగితేనే ఈ సర్జరీని విజయవంతంగా చేయగలమని నిర్ణయం తీసుకున్నారు.
అసుల విషయం ఏంటంటే.. కన్హంగాడ్ కు చెందిన 46 ఏళ్ల ఒక వ్యక్తి తన ప్రైవేట్ భాగాల్లో తీవ్రంగా నొప్పి ఉందని ఆస్పత్రి వచ్చాడు. అతడికి వైద్య పరీక్షలు చేస్తే.. అనతి ప్రైవేట్ భాగాలు బాగా వాచిపోయి ఉన్నాయి. అతను మూత్ర విసర్జన చేయలేకపోతున్నాడు. దీంతో అతని శరీరంలో బయటికి పోవాల్సిన మూత్రం నిలువ ఉండడం వల్ల శరీరంలో వాపు ఎక్కువ అవుతోంది. ఆ వ్యక్తి శరీరంలో ముఖ్యంగా అతని పురుషాంగం పైన చేతి వేలికి వేసుకునే ఉంగరం లాంటి వస్తువు గట్టిగా బిగుసుకు పోయింది. దీంతో మూత్ర నాళాలు బిగించుకుపోయి.. రోగి మూత్ర విసర్జన చేయలేకపోతున్నాడు. ఉంగరంలా ఉన్న ఆ వస్తువు చిన్న సైజులో గట్టిగా గుండ్రంగా ఉంది. ఆ వస్తువు అడ్డుగా ఉండడంతోనే రోగికి ఈ సమస్య వచ్చింది. అందుకే దీన్ని తొలగించాలని వైద్యులు భావించారు.
Also Read: పగలు పాఠాలు చెప్పే టీచర్ ఉద్యోగం.. రాత్రి ఆన్ లైన్‌లో అందాల ఆరబోత
ఆ రింగ్ తొలగించడానికి సర్జరీ చేయాలని మార్చి 25 205 రాత్రి ఆపరేషన్ ప్రారంభించాక.. అది మూమూలు రింగ్.. చాలా గట్టిగా, గుండ్రంగా ఉండే ఐరన్ వాషర్ రింగ్ అని తేలింది. దీంతో ఎంత ప్రయత్నించినా వైద్యులు దాన్ని తొలగించలేకపోయారు.
ఇలాంటి పరిస్థితులు అగ్ని ప్రమాదాల వేళ ఎదురవుతాయని.. ఎక్కడైన లోపలికి వెళ్లాలంటే అడ్డుగా ఏదైనా వస్తువులుంటే వాటిని కత్తిరించేందుకు అగ్నిమాపక సిబ్బంది కట్టర్లను ఉపయోగిస్తారని ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ పవిత్రన్ మిగతా వైద్యులకు తెలిపారు. దీంతో వారంతా వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోన్ చేశారు. వారికి విషయం తెలియజేశారు. ఈ ఆపరేషన్ పూర్తి చేసేందుకు అగ్నిమాపక సీనియర్ సిబ్బంది సాయం కావాలని కోరారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక అధికారులు తమ సిబ్బందిలోని అయిదుగురిని ఆస్పత్రికి పంపారు.
అలా ఆస్పత్రికి వెళ్లిన అగ్ని మాపక సిబ్బంది. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి చూస్తే.. ఆపరేషన్ బెడ్ పై ఒక రోగి పురుషాంగంపై ఐరన్ వాషర్ రింగ్ తొడిగి ఉంది. అది బాగా బిగుసుకుపోయి ఉండడంతో వారు రింగ్ కట్టర్లను ఉపయోగించారు. ఈ సర్జరీ రెండు గంటల పాటు సాగింది. చివరికి ఆ రింగ్ ని కట్టర్ సాయంతో కట్ చేయగలిగారు. ఆపరేషన్ విజయవంతమయ్యాక.. ఆ ఐరన వాషర్ రింగ్ అక్కడికి ఎలా చేరుకుందని రోగిని ప్రశ్నించగా.. ఆ రోగి తాను మద్యం సేవించి మత్తుల్లో ఉన్నప్పుడు ఎవరో తనకు ఇబ్బంది కలిగించాలని చేశారని.. ఎవరు చేశారో కూడా తనకు తెలియదని సమాధానం చెప్పాడు.