BigTV English

BRS : కేటీఆర్ కంటే కవితే టాప్.. హరీశ్‌రావు అంతకుమించి..

BRS : కేటీఆర్ కంటే కవితే టాప్.. హరీశ్‌రావు అంతకుమించి..

BRS : కేసీఆర్ కుటుంబంపై ఎప్పుడూ పొలిటికల్ కాంట్రవర్సీ ఉండనే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు సిస్టమ్‌ను తమ కంట్రోల్‌లో పెట్టుకుని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు. పవర్ పోయాక.. కల్వకుంట్ల ఫ్యామిలీ డొల్లతనమంతా బయటపడుతోంది. అటు, తెలంగాణ రిచెస్ట్ స్టేట్ అంటూ పదేళ్లు ఊదరగొట్టారు. లేటెస్ట్ కాగ్ రిపోర్టుతో లెక్కల గోల్‌మాల్ అంతా బయటపడింది. కేసీఆర్ కాలంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే విమర్శిస్తున్నారు. తెలంగాణను దివాళా తీయించిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ.. గడిచిన పదేళ్లలో వాళ్లు మాత్రం రిచెస్ట్ పీపుల్‌గా ఎదిగారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.


పదేళ్లలో కేసీఆర్, కేటీఆర్‌ల కంటే కవితనే ఎక్కువ దోచుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. కవిత కంటే హరీశ్‌రావు ఇంకా ఎక్కువ దోచుకున్నారని అన్నారు. కేసీఆర్ ఇప్పటికే 50 లక్షలకు పైగా జీతం తీసుకుని ఫాంహౌజ్‌లో పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఈ పొలిటికల్ వార్ ఏంటంటే…

తెలంగాణ అప్పులపై కవిత కామెంట్స్


తెలంగాణ రాష్ట్ర అప్పులు 4.42 లక్షలని పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిందని.. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని కవిత ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇకనైనానిజాలు చెప్పాలని అన్నారు.

కవితకు కౌంటర్‌గా కాంగ్రెస్ ప్రెస్‌మీట్

కేంద్రప్రభుత్వం వెల్లడించిన అప్పు FRMB లెక్కల ప్రకారం మాత్రమేనని.. అది కాకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కేసీఆర్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిందని.. నిధులు మళ్లించిందని కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. లిక్కర్ లెక్కల మాదిరే కవిత దొంగ లెక్కలు చెబుతున్నారని బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం సలహాలు ఇస్తే తీసుకుంటామని.. పింక్ మీడియాతో అడ్డగోలుగా మాట్లాడిస్తే మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. నిబద్ధతతో, చిత్తశుద్దితో సీఎం రేవంత్ రెడ్డి 24 గంటలు కష్టపడి పని చేస్తున్నారని.. ప్రజాప్రభుత్వంపై విషం చిమ్మితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొడతారని కవితను హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్ అని చెప్పారు.

కేటీఆర్, హరీశ్‌రావులు ముందుముందు మాజీలే..

కాంగ్రెస్ డబుల్ డోస్ పెంచింది. సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, సిరిసిల్లలో కేటీఆర్.. ఈ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో మాజీలు అవడం ఖాయమంటూ హస్తం నేత, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. రైతులకు సంకెళ్లు వేసిన.. అమరవీరుల కుటుంబాలను ఇబ్బంది పెట్టిన చరిత్ర గులాబీ పార్టీదని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రజలు BRSను వంద ఫీట్ల గోతిలో బొందపెట్టారన్నారు. బీజేపీ చెబుతున్న అబద్దపు మాటలను.. బీఆర్ఎస్ సోషల్ మీడియా నిజం చేయడానికి అష్టకష్టాలు పడుతోందని చెప్పారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను కానీ.. ఏమాత్రం డ్యామేజ్ చేయలేరని అన్నారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×