Robinhood Vs Mad Square: ఈ వారం తెలుగులో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా.. రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో థియేటర్లోకి వచ్చాయి. డబ్బింగ్ సినిమాల్లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎల్ 2: ఎంపురాన్’, చియాన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర శూరన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక టాలీవుడ్ నుంచి వచ్చిన రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యాయి. మరి ఈ రెండు సినిమాల పరిస్థితేంటి?
రాబిన్‌హుడ్ ఎలా ఉంది?
నితిన్ (Nithin) హీరోగా నటించిన “రాబిన్‌హుడ్” (Robinhood) సినిమా.. ఒక హైస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన.. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాను 2025 మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. వెంకీ కుడుముల గతంలో నితిన్‌కు “భీష్మ” వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కావడంతో.. రాబిన్ హుడ్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వస్తోంది. కాకపోతే.. ఫస్ట్ హాప్ బాగుందని అంటున్నారు. సెకండాఫ్ కూడా బాగుంటే.. హిట్ టాక్ పడి ఉండేదని అంటున్నారు. డేవిడ్ వార్నర్ క్లైమాక్స్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడని.. ఆయన ప్లేస్‌లో ఎవ్వరున్న నడిచిపోయేదట. కానీ వార్నర్ హైప్ ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. అదిదా సర్ప్రైజ్ సాంగ్‌లో కాంట్రవర్శీ అయిన స్టెప్ కట్ చేశారు. హీరోయిన్‌గా శ్రీలీల నటించడం, అదిదా సర్ప్పైజ్ సాంగ్‌లో కేతిక చేసిన రచ్చ.. ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో చేయడంతో.. ఈ సినిమా జస్ట్ ఓకె అనే టాక్ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా రాబిన్ హుడ్ ఎంటర్టైనర్ మాత్రమే అని అంటున్నారు.
మ్యాడ్ స్క్వేర్ పరిస్థితేంటి?
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గతంలో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ ((MAD Square)) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోలు మారలేదు. వాళ్లతోనే సెకండ్ పార్ట్ తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా కావడంతో.. మ్యాడ్ స్క్వేర్‌ను ప్రమోషన్స్‌తో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. అందుకు తగ్గట్టే.. మంచి పాజిటివ్ టాక్ అందుకుంది మ్యాడ్ స్క్వేర్. లాజిక్స్ లేకుండా చూస్తే నవ్విస్తుందని అంటున్నారు. కానీ ఈ సినిమాకు కూడా ఫస్ట్ హాప్‌నే బాగుందని అంటున్నారు. ఓవరాల్‌గా ఈ రెండు సినిమాల్లో ఏది కూడా సాలిడ్ హిట్ అనే టాక్ అందుకోలేదు. కానీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవలేదనే టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే.. బిజినెస్ పరంగా చూస్తే నితిన్‌ది చాలా పెద్ద సినిమా. 29 కోట్ల బిజినెస్‌తో బరిలోకి దిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 55 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఇక మ్యాడ్ స్క్వేర్‌కు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్ల కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది బిగ్గెస్ట్ అవుతుందో చూడాలంటే.. ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే!