E-Paper
Advertisement

Husband Caught Wife: ప్రియుడితో కలిసి హోటల్‌లో.. భర్తకి చిక్కిన భార్య, చివరకు భర్తపై చిందులు, వీడియో వైరల్

Husband Caught Wife: ప్రియుడితో కలిసి హోటల్‌లో.. భర్తకి చిక్కిన భార్య, చివరకు భర్తపై చిందులు, వీడియో వైరల్
Advertisement

Husband Caught Wife: చిన్నిచిన్న సమస్యలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా భార్యభర్తలు దూరం దూరంగా ఉంటున్నారు. తాజాగా ప్రియుడితో కలిసి భార్యని హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. ఆ తర్వాత భర్తపై చిందులేసింది భార్య. తన భర్త చచ్చినవాడితో సమానమని తేల్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది?

ప్రియుడితో కలిసి హోటల్‌లో ఆ మహిళ

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ ఫ్యామిలీ వివాదం హైవోల్టేజ్ డ్రామాగా మారింది. నాలుగు గోడలు మధ్య చర్చించు కోవాల్సిన విషయాలు నాలుగు రోడ్ల మధ్యకు వచ్చింది. ఝాన్సీలోని పైన కనిపిస్తున్న దంపతులు వివాహం చేసుకుని మూడేళ్లు అయ్యింది.  వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. ఫలితంగా భార్యభర్తల గొడవలు తీవ్రరూపం దాల్చాయి.

రెండేళ్ల కిందట న్యాయస్థానంలో విడాకులు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ దంపతుల మధ్య చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఆ తర్వాత కోర్టు ద్వారా ఓ ఒప్పందానికి వచ్చారు. వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. మహిళ తన మామతో కలిసి ఉంటోంది.  ఏడాదిన్నరగా ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని అనుమానించారు ఆమె భర్త.

Advertisement

భర్తకి చిక్కిన భార్య.. చివరకు భర్తపై చిందులు

మహిళ ఓ పాఠశాలలో ఉద్యోగం చేస్తోంది. ఇదే క్రమంలో జనవరి 11న ఆ మహిళ తన ప్రియుడితో హోటల్ రూమ్‌లో ఉన్నట్లు భర్తకు సమాచారం వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమె భర్త..  పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  పోలీసులు రాకముందే హోటల్‌లో పెద్ద గందరగోళం చోటు చేసుకుంది. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది కట్టుకున్న భార్య.

తన భర్త బ్రతికే ఉన్నా, చనిపోయినవాడితో సమానమని తేల్చి చెప్పింది. తాము స్వయంగా హోటల్‌కి వచ్చామని అంగీకరించింది. ఈలోగా పోలీసులు వచ్చేసరికి ఆమె ప్రియుడు మంచం కింద దాక్కున్నాడు. వాడ్ని పోలీసులు బయటకు తీశారు. పోలీసుల ముందు కీలక విషయాలు బయటపెట్టింది.

ALSO READ:  గాంధీభవన్‌లో భారీ పాము..  సంక్రాంతి సెలవులతో తప్పిన ప్రమాదం

ఇప్పటికే తాము విడాకుల కోసం అప్లై చేశామని చెప్పింది. ముగ్గురి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు పోలీసులు. విడాకులకు బదులుగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేస్తోందని ఆరోపించాడు భర్త. తాను భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది ఆ మహిళ. ఈ వ్యవహారం చివరకు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×