BigTV English

Trending News: ఛీఛీ.. ఇంత కక్కుర్తి ఏంటి.. లంచంగా ఆలు గడ్డలు తీసుకున్న పోలీస్

Trending News: ఛీఛీ.. ఇంత కక్కుర్తి ఏంటి.. లంచంగా ఆలు గడ్డలు తీసుకున్న పోలీస్

Trending News: ఓ పోలీస్ ఆఫీసర్ లంచం పేరుతో చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లంచం పేరుతో ఏకంగా ఐదు కేజీల ఆలు గడ్డలను తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. లంచంగా ఆలు గడ్డలను తీసుకున్న కారణంతో కన్నౌజ్ లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్పెక్టర్ పోలీస్ ఆఫీసర్ ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆలు గడ్డలను లంచానికి కోడ్ గా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తొలుత నిజంగానే ఆలు గడ్డలు లంచంగా తీసుకున్నాడని అనుకున్నారు. కానీ చివరకు ఆలు గడ్డలను ఓ కోడ్ మాదిరి వాడుకున్నారని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేసి సస్పెండ్ చేశారు.


సాధారణంగా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు, కార్లు, బైక్ లు, నగలు వంటివి లంచంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా ఆలు గడ్డలు లంచంగా తీసుకున్నాడు అని తెలియడంతో అందరు మొట్టమొదటి సారిగా షాక్ అయ్యారు. కానీ వీటిని ఓ కోడ్ గా ఉపయోగించాడని తేలింది. కాగా, సారిఖ్ పోలీస్ స్టేషన్ లో భావల్ పూర్ చపున్నా చౌకీలో ఎస్ఐగా రామ్ కృపాల్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ కేసుపై స్టేషన్ కు వచ్చిన వ్యక్తిని ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు. ఈ తరుణంలో ఐదు కేజీల ఆలు గడ్డలు కావాలని డిమాండ్ చేశాడు.

అయితే విచారణలో భాగంగా బాధితుడిని విచారించగా అసలు నిజం బయటపడింది. లంచంగా అడిగింది ఆలు గడ్డలు కాదని తెలిపాడు. లంచంగా ఐదు కిలోలు ఇచ్చుకోలేనని, కేవలం రెండు కిలోలు మాత్రమే ఇవ్వగలను అని తెలిపాడు. అయితే తన డిమాండ్ తీర్చలేకపోతున్నట్లు తెలపడంతో ఎస్ఐ మండిపడ్డాడు. దీంతో చివరకు మూడు కిలోలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఎస్ఐ, బాధితుడి మధ్య సంభాషణకు సంబంధించి అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీంతో అధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు.


Related News

Fact Check: క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడా? ఆ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

RGV Tweet: కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Big Stories

×