E-Paper
Advertisement

Harishrao: మీరు పరాన్నజీవుల వలే ప్రవర్తిస్తున్నారు.. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు: హరీశ్ రావు

Harishrao: మీరు పరాన్నజీవుల వలే ప్రవర్తిస్తున్నారు.. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు: హరీశ్ రావు
Advertisement

Harishrao Seirous: సీతారామ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను తామే చేసినట్లుగా చెబుతుందన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు ఇష్టమైన ప్రాజెక్టు. ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారు. కేవలం 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసింది? కాంగ్రెస్ నేతలు పరాన్న జీవుల వలే ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీపడి మరి పర్యటనలు చేస్తున్నారు. మేం ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మేం చేసిన ప్రతి మంచి పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా చెబుతున్నారు.

Advertisement

Also Read: రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్

కేసీఆర్ కాకుండా సీతారామ ప్రాజెక్టును వేరేవారు రూపకల్పన చేసి ఉంటే అంత బాగుండేదా? ఉమ్మడి ఏపీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదు. కానీ, కేసీఆర్ ఆ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ఆలోచన చేశారు. 8 ప్యాకేజీల్లో ఐదు బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. మరో 3 ప్యాకేజీల్లో 80 శాతం పనులను కూడా మేమే పూర్తి చేశాం’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×