Indian Army Video: ఉగ్రవాదుల స్థావరాలపై ఎటాక్ చేసిన విజువల్స్‌ను విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ వెస్ట్రన్ కమాండ్. ఈ నెల 10న జరిగిన దాడి విజువల్స్‌ను రిలీజ్ చేసింది. పీవోకేలో ఉన్న పోస్టులపై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల స్థావరాలు పూర్తిగా మంటల్లో ధ్వంసమయ్యాయి. శత్రువులు యుద్ధ ఉల్లంఘనకు పాల్పడినందు వల్లే..టెర్రరిస్టు పోస్టులంటన్నింటినీపై దాడి చేసినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ దాడుల తర్వాత.. శత్రువులు వారి స్థావరాలను వదిలేసి పారిపోయారని ఇండియన్ ఆర్మీ వెస్ట్రన్ స్పష్టం చేసింది.
ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ విజువల్స్ విడుదల
ఈనెల 9వ తేదీ రాత్రి 9 గంటలకు శత్రువులు యుద్ధ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అందుకే వాళ్ల పోస్టులంటన్నింటినీ మట్టిలో కలిపేసినట్లు భారత్ ఆర్మీ తెలిపింది. ఈ నెల10వ తేదీ సాయంత్రం 4.30కి దాడి చేసిన విజువల్స్‌ను ఇప్పుడు విడుదల చేసింది.
కాగా.. ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో చూశాం. ఎయిర్‌స్ట్రైక్ చేస్తే టెర్రరిస్టులు ఎంతలా ఎఫెక్ట్ అయ్యారో చూశాం. ఈసారి.. పహల్గామ్ టెర్రర్ ఎటాక్‌కు ప్రతీకారంగా ఎలాంటి స్ట్రైక్ చేస్తారోనని ఎదురుచూస్తున్న టైమ్‌లో.. మిసైల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. ఈ దెబ్బతో.. ఇండియా కొడితే ఎలా ఉంటుందో.. పాకిస్తాన్‌కు మరోసారి బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ కొట్టిన దెబ్బ.. ఉగ్రవాదుల ఊహకు కూడా అందలేదు. అసలు.. అంత పక్కాగా ఉగ్రవాద స్థావరాలను ఎలా గుర్తించగలిగారు? ఈ ఆపరేషన్‌లో.. ఇండియా ఇంటలిజెన్స్ ఎలా పనిచేసింది?
ఉగ్రవాదం వెన్ను విరిచిన ఇండియన్ ఆర్మీ
టెర్రరిస్టుల క్యాంపులపై మిస్సైల్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్ర స్థావరాలు ఖతం
ఉగ్రవాదం ఎక్కడున్నా.. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా.. టెర్రరిజాన్ని చీల్చిచెండాడుతుంది ఇండియా అని చెప్పేందుకు.. ఆపరేషన్ సిందూర్ మరో గ్రేట్ ఎగ్జాంపుల్. ఉగ్రదాడులతో భారత్‌లో మారణహోమం సృష్టించి.. పాకిస్థాన్‌లో ఎక్కడ దాక్కున్నా సేఫ్ అని ఫీలయ్యే ఉగ్రవాదులను వెతుక్కుంటూ.. ఇండియా మిసైల్స్ వచ్చేస్తాయని నిరూపించిన దాడి ఇది. అయితే.. ఒక ఎటాక్ ఇంత ఖతర్నాక్‌గా ఉండటానికి.. ఇంత కచ్చితంగా ఇండియన్ ఆర్మీ దాడులు చేయడానికి.. ఇంతటి తీవ్రస్థాయిలో దాడి జరగడం వెనుక.. అంతే గొప్ప ఇంటలిజెన్స్ కూడా ఉంటుంది.
పాకిస్తాన్ 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఎటాక్
అంతకుమించిన కచ్చితమైన సమాచారం కూడా ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో.. 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ చేసిన మిసైల్ ఎటాక్స్.. ఉగ్రవాదం వెన్ను విరిచాయి. ఈ సైనిక చర్య వెనుక విశ్వసనీయ సమాచారం ఉంది.
మన్సెహ్రా, హవేలీలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు
ఆపరేషన్ సిందూర్ రెండు దశల్లో జరిగింది. మొదటగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిరాజ్ 2000, సుఖోయ్ 30 ఎంకెఐ ఫైటర్ జెట్స్‌తో.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్, కోట్లీ, భింబర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని కచ్చితమైన బాంబు దాడులు చేశాయ్. వీటిలో.. టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపులు, లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఇవి భారత్‌పై ఉగ్రదాడులకు ఉపయోగిస్తున్నారు. రెండో దశలో.. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ సమన్వయంతో.. పాకిస్తాన్‌లోని బహవల్పూర్, మురిడ్కే, మన్సెహ్రా, హవేలీలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించాయి. ఈ టార్గెట్లలో బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ హెడ్ క్వార్టర్స్, మురిడ్కేలోని లష్కరే తోయిబా ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి.
ఖతర్నాక్ మిసైల్ ఎటాక్ వెనుక గొప్ప ఇంటలిజెన్స్
భారత్ చేసిన స్ట్రైక్స్.. అత్యంత కచ్చితమైన ఇంటలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా జరిగాయ్. ముఖ్యంగా.. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.. రా సహా, ఇతర ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, ఇంటలిజెన్స్ యూనిట్లతో.. ఈ ఉగ్రవాద స్థావరాల వివరాలు సేకరించారు. ఉగ్రవాద స్థావరాలను ఇంత పక్కాగా గుర్తించడంలో.. రా సహా ఇంటలిజెన్స్ ఏజెన్సీలు.. హ్యూమన్ ఇంటలిజెన్స్, సిగ్నల్ ఇంటలిజెన్స్, ఇమేజరీ ఇంటలిజెన్స్ కీలకంగా పనిచేశాయ్. ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ క్యాంపుల గురించి కచ్చితమైన సమాచారాన్ని సేకరించారు.
ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడారు?
ఉగ్ర స్థావరాల్లో.. ఉగ్రవాద కార్యకలాపాలను ట్రాక్ చేసేందుకు ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలను ఉపయోగించాయి. ఇందులో రియల్-టైమ్ నిఘా కూడా ఉంది. శాటిలైట్ ఇమేజరీ, డ్రోన్ నిఘా, ఇంటర్‌సెప్టెడ్ కమ్యూనికేషన్ల ద్వారా ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన కచ్చితమైన కో-ఆర్డినేట్లను అందించాయి. ఈ స్థావరాల్లో శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు భద్రపరిచిన స్థలాలు, టెర్రరిస్ట్ కమాండర్ల సమావేశ స్థలాలున్నాయి. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్.. కేవలం 25 నిమిషాల్లోనే జరిగిందని.. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.
ఇంటలిజెన్స్ ఇన్‌పుట్స్‌తోనే పక్కాగా దాడి చేసి దళాలు
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత.. ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థలను గుర్తించేందుకు విస్తృతమైన విశ్లేషణలు చేశాయి. ఉగ్రదాడికి సంబంధించిన సాక్ష్యాలు, బాధితుల స్టేట్‌మెంట్లు, టెక్నికల్ ఇంటలిజెన్స్ ఆధారంగా.. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందనే విషయం స్పష్టమైంది. ఈ సమాచారం ఆధారంగానే.. 9 టార్గెట్లను సెలక్ట్ చేశారు. మరోవైపు.. జాతీయ భద్రతా సలహాదారు.. అజిత్ ధోవల్ నేతృత్వంలో 15కి పైగా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. వీటిలో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిపెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. ఈ హై-లెవెల్ మీటింగ్స్‌లో.. ఇంటలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా దాడి చేయాల్సిన లక్ష్యాలను ఖరారు చేశారు. మన ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అందించిన పక్కా సమాచారం, కచ్చితమైన కో-ఆర్డినేట్ల ఆధారంగా.. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్‌ని సూపర్ సక్సెస్ చేశాయి.
Planned, trained & executed.
Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon
— Western Command – Indian Army (@westerncomd_IA) May 18, 2025