Puri Jagannath: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆలయాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి దేవాలయం ఒకటి. ఒక్కో దగ్గర ఒక్కో ఆచారం ఉంటుంది. అందులో ఏమైనా తప్పు జరిగితే అనేక ఇబ్బందులు వస్తాయని భావిస్తుంటారు. అలాంటిది.. మహాప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుంది. అసలేం జరిగింది?
పూరీ జగన్నాథ స్వామి దేవాలయం గురించి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ప్రతీ ఏడాది ఆషాడంలో జరిగే రథయాత్రకు భక్తులు లక్షల్లో అక్కడికి తరలివస్తుంటారు. ఎంతో విశిష్టత కలిగిన జగన్నాథుడి ఆలయంలో ఊహించని అపచారం జరిగింది.
స్వామికి నివేదించిన మహాప్రసాదం డైనింగ్ టేబుల్‌పై పెట్టి కూర్చుని ఓ కుటుంబం తింటున్న వీడియో ప్రస్తుతం వివాదానికి కేరాఫ్‌గా మారింది. అదేంటి.. ప్రసాదం కింద పెడితే తప్పు.. టేబుల్‌పై పెట్టడం తప్పా? అనేది కొందరి భక్తుల ప్రశ్న.
శతాబ్దాల తరబడి పూరీ జగన్నాథ ఆలయంలో ఒక ఆచారం ఉంది. స్వామికి నైవేధ్యంగా సమర్పించే మహాప్రసాదాన్ని భక్తులు నేలపై కూర్చుని తినే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే 10 మంది కుటుంబ సభ్యులు పూరీకి వచ్చారు. బీచ్ రిసార్టులో ఓ డైనింగ్ టేబుల్ వద్ద ఆ ఫ్యామిలీ కూర్చొంది. అదే సమయంలో ఓ పూజారి వారికి మహాప్రసాదాన్ని పంచుతున్నారు.
ALSO READ: ఉగ్రవాదులు పరార్, ఆర్మీ ఎటాక్ వీడియో వైరల్
నార్మల్‌గా స్వామి ప్రసాదం కింద కూర్చుని తినాలి. కాకపోతే పూజారి ఆ ప్రసాదాన్ని టేబుల్‌పై పెట్టారు. ఆ తర్వాత ఆ మహా ప్రసాదాన్ని భక్తులు తీసుకుని తింటున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆ సన్నివేశాన్ని చూసి ఆ కుటుంబాన్ని ప్రశ్నించాడు.
ఆ కుటుంబానికి చెందిన మహిళ ఈ విధంగా రిప్లై ఇచ్చింది. అనుమతి అడిగిన తర్వాత టేబుల్ వద్ద తినాలనుకున్నామని చెప్పింది. వెంటనే ఆ వ్యక్తి పూజారిని ప్రశ్నించారు. ఈ విధంగా ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. టేబుల్‌పై మహాప్రసాదాన్ని తినడం సంప్రదాయ విరుద్ధమని తెలిపింది. స్వామి మహాప్రసాదం పర బ్రహ్మ స్వరూపంలో పూజించబడుతుందని తెలియ జేసింది. నేతలపై కూర్చుని భక్తులు అత్యంత శ్రద్ధలతో తీసుకోవాలని, అనాదిగా వస్తున్న ఆచారమని వెల్లడించారు.
భక్తులు దయచేసి సంప్రదాయానికి విరుద్ధంగా చేయడం మానుకోవాలని సూచించారు. పూరీ ఆలయంలో స్వామివారికి ప్రతీ రోజూ 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రపంచంలో అతిపెద్ద వంటశాల ఈ ఆలయంలో ఉంది. శ్రీమన్నారాయణుడి దేవేరి, సంపదలకు అధి దేవత శ్రీలక్ష్మీ ఈ వంటశాలను స్వయంగా పర్యవేక్షిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ తయారు చేసిన నైవేద్యాలను స్వామికి సమర్పించిన తర్వాత భక్తులకు అందజేస్తారు. మహా ప్రసాదాన్ని చుట్టుపక్కల పేదలకు పంచిబెడతారు.
ଭିଡ଼ିଓ ରେ ଦେଖନ୍ତୁ ସେ ହୋଟେଲର କର୍ମଚାରୀ ମନା କରିବା ସତ୍ତ୍ବେ ସେମାନେ କିପରି ଡାଇନିଂ ଟେବୁଲ ଉପେର ମହାପ୍ରସାଦ ବାଢ଼ି ଗୋଡ଼ ହଲେଇ ମୋବାଇଲ ଚଲାଇ ପାଉଛନ୍ତି..ଆଉ ତହୁଁ ବଡ଼ ସେ ବ୍ରାହ୍ମଣ ମହାଶୟ ଯିଏ ମହାପ୍ରସାଦ ତାଙ୍କୁ ବାଢ଼ିକି ଦେଇଛନ୍ତି।ଆଉ ସେ ଦାଢ଼ିଆ ବାବା ସବୁ ଦେଖି ମଧ୍ଯ ଚୁପ ହୋଇ ଠିଆ ହୋଇଛନ୍ତି।ଦୋଷ କାହାକୁ ଦେବେ? pic.twitter.com/ktH4KLpTkd
— 🦋šrαdhα🦋 (@princess_sradha) May 16, 2025