E-Paper
Advertisement

Honking: హార్న్ కొడితే.. రెడ్ సిగ్నల్ సమయం పెరిగిపొద్ది.. ముంబయి పోలీసుల సరికొత్త ఆలోచన!

Honking: హార్న్ కొడితే.. రెడ్ సిగ్నల్ సమయం పెరిగిపొద్ది.. ముంబయి పోలీసుల సరికొత్త ఆలోచన!
Advertisement

The Punishing Signal: వాహనదారులు అవనసరమైన చోట గంటలు గంటలు వెయిట్ చేస్తారు. కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిమిషం పాటు నిలబడలేకపోతారు. ఎల్లో లైట్ పడగానే హారన్లతో హోరెత్తిస్తారు. గ్రీన్ సిగ్నల్ పడేందుకు రెండు, మూడు సెకెన్లు ఉండగానే దూసుకెళ్తారు. ఇలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు తిక్క కుదిరే ప్లాన్ చేశారు. హాంకర్లను అరికట్టడానికి కొన్ని ఎంపిక చేసిన సిగ్నల్స్ దగ్గర డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఎంత ఎక్కువగా హారన్ కొడితే రెడ్ లైట్ అంత ఎక్కువ సేపు ఉండేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి రాగానే సైలెంట్ అయిపోతున్నారు.

ముంబై ట్రాఫిక్ పోలీసుల క్రేజీ ఆలోచన!

కొద్ది కాలం క్రితం వరకు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో శబ్ద కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితిని ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. అందులో భాగంగానే ‘ది పనిషింగ్ సిగ్నల్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యమైన సిగ్నల్స్ దగ్గర డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ వాహనదారులు కొట్టే హారన్ శబ్దాన్ని డెసిబెల్ మీటర్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ శబ్దం ఎక్కువ అయ్యే కొద్ది రెడ్ సిగ్నల్ మరితం సేపు వెలుగుతుంది. హారన్స్ శబ్దం 85 డెసిబెల్స్ స్థాయిని మించిపోయినప్పుడు, సిగ్నల్ టైమర్ రీసెట్ అవుతుంది. దీని వలన అన్ని వాహనాలకు డబుల్ వెయిటింగ్ టైమ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఎంత ఎక్కువగా హారన్ కొడితే, అంత ఎక్కువగా సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సైలెంట్ గా ఉండే త్వరగా గ్రీన్ లైట్ పడి వెయిట్ చేయకుండానే వెళ్లొచ్చు. ఈ విధానం ద్వారా ముంబై వాహనదారులు హారన్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొడుతున్నారు.

కీలక సిగ్నల్స్ దగ్గర డెసిబెల్ మీటర్ల ఏర్పాటు

Advertisement

ముంబై నగరంలోని కీలక ట్రాఫిక్ సిగ్నల్స్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్, మెరైన్ డ్రైవ్, పెడ్డర్ రోడ్, హింద్మాతా సినిమా దాదర్, బాంద్రాలోని ప్రధాన జంక్షన్లు, సిగ్నల్స్ లో డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు.  ముంబై పోలీసులు ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా షేర్ చేశారు. ఇందులో హారన్ కొడితే ట్రాఫిక్ సిగ్నల్ ఎలా రీసెట్ అవుతుందో చూపించారు. ప్రజలకు, వాహనదారులకు శబ్దకాలుష్యం గురించి అవగహన కల్పించేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బెసిబెల్ మీటర్స్ ఏర్పాటు చేయడం పట్ల నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల తీరును అభినందిస్తున్నారు.ఈ విధానంతో కచ్చితంగా ముంబై వాహనదారులలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. “హారన్ మోగించడం చెడు అలవాటు మాత్రమే కాదు. ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్య. కాలుష్య ప్రమాదంతో పాటు ట్రాఫిక్ క్రమశిక్షణా రాహిత్య చర్య కూడా” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. దేశ వ్యాప్తంగా ఈ మీటర్లను అమర్చాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Read Also:  థార్ ను లాక్కెళ్లిన గాడిదలు.. మహీంద్రా రియాక్ట్ కాలేదా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×