BigTV English

Bengaluru Interview: ఇంటర్వ్యూలో 5వ తరగతి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన అభ్యర్థులు.. జెన్ z ఇంతేనా?

Bengaluru Interview: ఇంటర్వ్యూలో 5వ తరగతి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన అభ్యర్థులు.. జెన్ z ఇంతేనా?

Bengaluru Job candidates: ఈ రోజుల్లో చాలా మంది ఉన్నత చదువులు చదివినప్పటికీ, వారిలో బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు. పేరు చివరన బోలెడు డిగ్రీలు పెట్టుకున్నా, నిజ జీవితంలో అవి దేనికీ పనికి రావడం లేదు. తాజాగా ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన కొంత మంది 5వ తరగతి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ఈ విషయాన్ని తాజాగా ఆ కంపెనీ సీఈవో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్టు వైరల్ గా మారింది.


జెన్ Z ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు   

బెంగళూరుకు చెందిన జెన్ Z ఈసీవో ఆశిష్ గుప్తా తాజాగా తన కంపెనీలో ఖాళీలను ఫిల్ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కంపెనీలో ఉద్యోగం కోసం చాలా మంది పోటీపడ్డారు. ఇంటర్యూకు వచ్చిన వారిని ఆశిష్ తన క్యాబిన్ కు పిలికి పలు రకాల ప్రశ్నలు అడిగారు. వారందరికీ కామన్ 5వ తరగతికి సంబంధించి సింపుల్ క్వశ్చన్ అడిగారు. “ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. ఫస్ట్ 60 కిలో మీటర్లు గంటకు 60 కి. మీ వేగంతో ప్రయాణించాడు. తర్వాత 60 కిలో మీటర్లు గంటకు 30 కిలో మీటర్ల వేగంతో వెళ్లాడు. ఇప్పుడు సగటు వేగం ఎంత?” అని అడిగాడు. ఈ ఇంటర్వ్యూకు హాజరైన చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ఈ విషయాన్ని ఆశిష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

ఆశిష్ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొందరు ఈ పోస్టు మీద పాజిటివ్ గా స్పందిస్తే, మరికొంత మంది నెగెటివ్ గా కామెంట్స్ పెట్టారు. ఈ తరం యువతీ, యువకులు వైరల్ కంటెంట్, రీల్స్ చేయడంలో మందున్నప్పటికీ, వారికి బేసిక్ విషయాల మీద నాలెడ్జ్ ఉండటం లేదన్నారు ఆశిష్. “నిజ జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత ఆర్థిక సహాయం కోసం ఈ ప్రాథమిక నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి. యువతరంలో విమర్శనాత్మక ఆలోచన, మ్యాథ్స్, విశ్లేషణాత్మక సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయనడానికి ఇదే ఉదాహారణ. ఇదే పద్దతి కొనసాగితే భవిష్యత్ తరాలు వ్యక్తిగత ఆర్థిక అంశాలు, నిర్ణయం తీసుకోవడం, సమస్యలను పరిష్కరించలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది” అన్నారు.

ఆసక్తికర సమాధానం ఇచ్చిన నెటిజన్

ఆశిష్ పోస్టు గురించి ఓ వ్యక్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీరు మ్యాథ్స్ కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. మీరు వారిని సేల్స్ ప్రొఫైల్ కోసం ఇంటర్వ్యూ చేస్తే ఈ ప్రశ్న అప్రస్తుతం. ఒకవేళ మీరు మ్యాథ్స్ టీచర్ కోసం ఇంటర్వ్యూ చేస్తే మీ ఆందోళనలను అర్థం చేసుకోగలను. కానీ, చాలా మంది CEOలకు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవచ్చు. అయినప్పటికీ వారు సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. వాళ్లకు కావాల్సింది నైపుణ్యం. బేసిక్ ఆప్టిట్యూడ్ పరీక్షలు కాదు. నేను DST (డిస్టెన్స్ స్పీడ్ టైమ్) ఫార్ములా కూడా నేర్చుకున్నాను. అయినప్పటికీ ఇంటర్వ్యూ కోసం ఎవరూ నన్ను ఈ ప్రశ్న అడగలేదు, ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే వారికి అది అవసరం లేదు. ఇక రీల్స్ గురించి ప్రస్తావించారు. మీ కంపెనీలో జాబ్ చేస్తే వచ్చే ఆదాయం కంటే, రీల్స్ చేస్తూ చాలా మంది ఎక్కువ సంపాదిస్తున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు” అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టారు.

Read Also:  రూ.12,478 కోట్లు విలువచేసే కంపెనీని రూ.74కే అమ్మేసిన ఈ బిజినెస్ మ్యాన్ గురించి మీకు తెలుసా?

Tags

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×