BigTV English

28°C Trailer: ఐదేళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు.. నవీన్ చంద్ర మూవీ ట్రైలర్ రిలీజ్.!

28°C Trailer: ఐదేళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు.. నవీన్ చంద్ర మూవీ ట్రైలర్ రిలీజ్.!

28°C Trailer:యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర (Naveen Chandra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన విభిన్నమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన.. ఎప్పటికప్పుడు తన నటనతో ప్రూవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోగా మాత్రమే కాకుండా డిఫరెంట్ పాత్రలు కూడా పోషిస్తూ అటు విలన్ గా తనను తాను నిరూపించుకుంటున్నాడు. అంతేకాదు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నవీన్ చంద్ర.. తాజాగా ’28°C’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో షాలిని వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పొలిమేర సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు.


ప్రియదర్శి, వైవాహర్ష, రాజా రవీంద్ర , జయప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ నాల్గవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇకపోతే విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి “చెలియా చెలియా” అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా.. ఇప్పుడు ప్రమోషన్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పాటకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ భరద్వాజ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. ఇక సింగర్ రేవంత్ ఆలపించారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచడానికి హైదరాబాదులో గ్రాండ్గా ఈవెంట్ ఏర్పాటు చేసి, ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు మేకర్స్. అటు ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు అని చెప్పవచ్చు.

ఇకపోతే 2020లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఏడాది ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటు విడుదల చేసిన ట్రైలర్ హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా కట్ చేసిన ట్రైలర్ లో చివరిగా “చనిపోయిన వాళ్ళు తిరిగొస్తారా”అనే డైలాగ్ తో ఎండ్ అవుతుంది ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే నవీన్ చంద్ర లేటుగా వచ్చినా సరే ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.


నవీన్ చంద్ర ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ముఖ్యంగా త్రిపుర సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇక తర్వాత కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించిన నవీన్ చంద్ర.. ఈమధ్య తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి తనకు సక్సెస్ ఇచ్చిన హార్రర్ జానర్ లోనే ఇప్పుడు సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి అంతా అనుకున్నట్లు జరిగితే నవీన్ చంద్రకు మళ్ళీ సినీ ఇండస్ట్రీలో మంచి కెరియర్ ఉంటుందనడంలో సందేహం లేదు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×