BigTV English

Viral News: చెయ్యని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీ.. ఇన్నాళ్లకు నిర్దోషి అని తీర్పు

Viral News: చెయ్యని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీ.. ఇన్నాళ్లకు నిర్దోషి అని తీర్పు

Iwao Hakamada Case: పది మంది నేరస్తులు తప్పించుకున్న ఫర్వాలేదు.. ఓ నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయస్థానం ప్రాథమిక సూత్రం. కానీ, జపాన్ లో జరిగిన ఓ ఘటన యావత్ న్యాయ వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలింది. ఈ ఘటన ప్రపంచ వ్యాయ వ్యవస్థలు సైతం షాక్ కు గురించి చేసింది. హత్య కేసులో 46 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించి సంచలనం సృష్టించింది. 42 ఏళ్ల వయసులో అతడు జైలుకు వెళ్లగా, 88 ఏండ్ల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చారు. చేయని తప్పకు ప్రపంచంలోనే అత్యధిక కాలం జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.


హత్య కేసులో మరణశిక్ష విధించిన న్యాయస్థానం

జపాన్ కు చెందిన మాజీ బాక్సార్ ఇవానో హకమడ 1968లో తన యజమానిని, అతడి భార్య, ఇద్దరు పిల్లలను చంపి, వారి డబ్బు నగలు దోచుకున్నాడని పోలీసులు అరెస్టు చేశారు. తాను ఈ నేరం చేయడలేదని హకమడ నెత్తి నోరు బాదుకున్నా పోలీసులు వదిలిపెట్టలేదు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లాకప్ లో చిత్రవధ చేశారు. పోలీసులు టార్చర్ తట్టుకోలేక ఆయన ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసులో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఘోరమైన నేరానికి పాల్పడ్డాడనే అభియోగాలపై అతడికి మరణశిక్ష విధించింది. అతడి ఉరిశిక్షను ఆ దేశ సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. కానీ, ఈ కేసులో పోలీసులు తనను అన్యాయంగా ఇరికించారని ఆయన ఎంతో మథనపడ్డారు. జైలులో ఉన్నా ఏనాడూ  న్యాయపోరాటాన్ని ఆపలేదు. తన సోదరి సాయంతో నిరంతరం అన్యాయమైన శిక్ష నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. తన కేసు పునర్విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు. చాలా సార్లు నిరాశే ఎదురయ్యింది. చివరకు 2014లో పునర్విచారణకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణలో ఆయన ఈ నేరం చేయాలేదని తేలింది. న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. దశాబ్దాల తన న్యాయపోరాటం ఫలించింది. జపాన్ యుద్ధానంతర చరిత్రలో పునర్విచారణకు అనుమతి పొందిన ఐదవ మరణశిక్ష ఖైదీగా హకమడ గుర్తింపు పొందారు. గతంలో నాలుగు కేసులలోనూ నిర్దోషులుగా తేలారు. తాజాగా హకమడ కూడా నిర్దోషిగా బయటకువచ్చారు.


కోర్టును చుట్టుముట్టిన వందలాది మంది మద్దతుదారులు

హకమడ విడుదల సందర్భంగా  వందలాది మంది కోర్టు దగ్గరికి చేరుకున్నారు. జపాన్ న్యాయ వ్యవస్థ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన హకమడ… జైలులో  ప్రతిరోజూ ఒక బౌట్‌ తో పోరాడినట్లు వెల్లడించారు.  ఒక్కసారి గెలవలేమని అనుకుంటే విజయానికి అవకాశం లేదన్నారు. తాను తప్పు చేయలేదనే నమ్మకమే ఈ రోజు నిజం అయ్యిందని వెల్లడించారు. చేయని తప్పుకు అర్ధ శతాబ్దానికి పైగా జైలులో మగ్గడం బాధగా ఉందన్నారు. కోర్టు బయట తన సోదరిని పట్టుకుని కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది.

Read Also : బికినీ వేసుకుంటానన్న భార్య.. ఆమె కోసం ఏకంగా ఐలాండే కొనేసిన భర్త

Related News

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Big Stories

×