BigTV English

Divorced Woman Matrimonial: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ

Divorced Woman Matrimonial: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ

Divorced Woman Matrimonial| సాధారణంగా మన సమాజంలో మహిళలు అమాయక మనస్తత్వం కలవారని ఒక భావన ఉంది. అందుకే స్త్రీలను గౌరవించాలి, వారికి ప్రత్యేక వసతులు ఇవ్వాలి అని అందరూ చెబుతుంటారు. కానీ కొందరు మహిళలు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. తాజాగా అలాంటిదే ఒక ఉదాహరణ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. అందులో ఒక యూజర్ తన అకౌంట్ ఒక పెళ్లి యాడ్ పోస్ట్ చేశాడు. ఆ యాడ్ చదువుతుంటే ఇలాంటి మహిళలు కూడా ఉంటారా? అని ఆశ్చర్యవేయకమానదు.


వివరాల్లోకి వెళితే.. విడాకులు తీసుకున్న ఒక మహిళ రెండో వివాహం కోసం ఒక యాడ్ ఇచ్చింది. ఆమె వయసు 39. విద్యార్హత బిఎడ్. సంవత్సరానికి రూ.1,32,000 సంపాదిస్తుంది. అంటే నెలకు రూ.11000. అయితే తనకు కాబోయే భర్త చాలా ధనవంతుడై ఉండాలని ఆమె డిమాండ్ చేస్తోంది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ఆమె ఇచ్చిన యాడ్ చూస్తే యువకులకు షాక్ తగలడం గ్యారంటీ.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..


తన కాబోయే భర్త కనీస ప్యాకేజీ రూ.30 లక్షలు (వార్షిక సంపాదన) ఉండాలట. అంటే సగటున నెలకు రూ.2.5 లక్షలు. అతను ఒక ఎన్‌ఆర్ఐ (ప్రవాస భారతీయుడు) ఇండియా, అమెరికా లేదా యూరోప్ లో సెటిల్ అయి ఉండాలట. తనకు ఫారిస్ తీసుకెళ్లాలట, 5 స్టార్ హోటల్స్ తనకు భోజనం చేయడం ఇష్టం కాబట్టి ప్రతి వారం పెద్ద హోటల్స్ తీసుకెళ్లాలట. ఇవి చదివితే ఏంటి ఇన్ని డిమాండ్లు చేస్తోందని అందరికీ అనిపిస్తోంది.

కానీ ఆమె అంతటితో ఆగలేదు. వరుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి ఉండాలి. విద్యార్హత ఎమ్ ఎస్ లేదా ఎంబిఏ ఉండాలి. అతనికి సొంతంగా 3BHK ఇల్లు ఉండాలి. ఆ ఇంట్లో తన తల్లిదండ్రులు కూడా తనతో కలిసి ఉంటారట. మహిళ ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లాలి కాబట్టి ఆమె వంట పని, ఇంటిపని చేయలేదు. అందుకే ఒక పని మనిషి, వంట మనిషి కూడా ఉండాలట. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త తల్లిదండ్రులతో కలిసి ఉండనని యాడ్ లో ముందే తెలిపిందండోయ్.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

సోషల్ మీడియా ప్రాట్ ఫామ్ ట్విట్టర్ ఎక్స్ లో ఈ యాడ్ బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ..”ఆమె జీతం నెలకు రూ.10000 కానీ ఇంట్లో పనిమనిషి కావాలా. పైగా ఫారిన్ తీసుకెళ్లే భర్త కావాలా?” అని రాశాడు. మరొక యూజర్ అయితే..”ఈమె గారు భర్త తల్లిదండ్రులతో ఉండలేదు. కానీ అతను మాత్రం ఈమె తల్లిదండ్రులను భరించాలి.. బాగుంది! ” అని కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్ అయితే ”ఆమె వార్షిక సాలరీ రూ.132000 కానీ ఫారిన్ వెళ్లి 5 స్టార్ హోటల్ లోకి వెళ్లాలని కలలు కంటోంది. ఇదే హిపోక్రసీ అంటే” అని కామెంట్ చేశాడు.

 

Related News

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Maid Fined: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Big Stories

×