E-Paper
Advertisement

Kerala News: అయ్యయ్యో.. ఆర్టీసీ బస్సులో అట్టపెట్టెలను ధరించిన కండక్టర్లు, ప్రయాణికులు.. వీడియో వైరల్

Kerala News: అయ్యయ్యో.. ఆర్టీసీ బస్సులో అట్టపెట్టెలను ధరించిన కండక్టర్లు, ప్రయాణికులు.. వీడియో వైరల్
Advertisement

Kerala News: ఆర్టీసీ బస్సులో వినూత్న ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కేరళలో ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న యువతి, తన పక్కనే ఉన్న వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో సదరు వ్యక్తి తీవ్రంగా అవమానానికి గురయ్యాడు. అయితే, ఆ తర్వాత జరిగిన విచారణలో ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని, బస్సు కుదుపుల వల్ల లేదా రద్దీ వల్ల అలా జరిగి ఉండవచ్చనే వాదనలు వినిపించాయి. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనపై పడ్డ ‘వేధింపుల’ ముద్రను తట్టుకోలేక, సమాజంలో తల ఎత్తుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషాద ఘటన కేరళ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఒకరిని దోషిగా తేల్చేముందు వాస్తవాలు తెలుసుకోవాలని, కేవలం ఆరోపణలకే ప్రాణాలు పోవడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే, పురుష ప్రయాణికులు, బస్సు సిబ్బంది తమ ఆత్మరక్షణ కోసం, అలాగే ఇతరుల నుండి ఇలాంటి తప్పుడు ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఒక వినూత్న నిరసనకు దిగారు.

Advertisement

బస్సులో ప్రయాణించేటప్పుడు పొరపాటున కూడా పక్కవారికి తాకకూడదనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు తమ శరీరానికి అట్టపెట్టెలను (Cardboard Boxes) కట్టుకుని ప్రయాణించారు. “మేము ఎవరినీ తాకడం లేదు, మా వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు” అని చెప్పడమే ఈ నిరసన ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా పురుషులు తమపై వచ్చే తప్పుడు వేధింపుల కేసుల పట్ల ఎంత భయపడుతున్నారో తెలుస్తుంది.

Also Read: రుణమాఫీ.. న్యాయం కావాలంటూ కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా రైతులు

Advertisement

ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మహిళల భద్రత ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఒక వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేసి వారి జీవితాలను బలితీసుకోకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం, ప్రజలు ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని, “ట్రయల్ బై మీడియా” వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×