E-Paper
Advertisement

Khammam News: సస్పెన్షన్ వేటుతో కుంగిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో వైరల్!

Khammam News: సస్పెన్షన్ వేటుతో కుంగిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో వైరల్!
Advertisement

Khammam News: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ భూక్యా గౌతమి సస్పెన్షన్ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ.. ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల కోసం ఆమె ప్రమోషన్ చేయడంతో పెద్ద  వివాదానికే దారితీసింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇతర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం లేదా ప్రైవేట్ ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం నిషిద్ధం. గౌతమి ఒక ప్రైవేట్ స్కూల్‌లో పిల్లలను చేర్పించాలంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేయడంతో.. విద్యాశాఖ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి ఆమెను విధుల నుండి సస్పెండ్ చేశారు.

Advertisement

సస్పెన్షన్ అనంతరం గౌతమి సోషల్ మీడియాలో తన భావోద్వేగపూరితమైన వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఆవేదనను పంచుకున్నారు. ‘ప్రైవేట్ స్కూళ్లకు ప్రమోషన్ చేయకూడదని తనకు ఎవరూ చెప్పలేదని, తెలియక చేసిన తప్పుగా ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని.. తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు’. సోషల్ మీడియాలో తనకు ఉన్న పాపులారిటీ కారణంగానే సదరు స్కూల్ యాజమాన్యం తనతో ప్రమోషన్ చేయించుకుందని ఆమె వివరించారు.

ప్రభుత్వ టీచర్‌గా ఉంటూ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం నైతికంగా తప్పని కొందరు వాదిస్తుంటే.. ఆమె అవగాహన లేక చేసిన పొరపాటును క్షమించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో , సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

ALSO READ: పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా.. సొంత క్యాడర్‌కు చింతకాయల విజయ్ మాస్ వార్నింగ్!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×