BigTV English

OnlyFans Creators: నెలకు రూ. 123 కోట్లు సంపాదిస్తున్న అమ్మాయిలు, ఛీ.. మరీ అలానా?

OnlyFans Creators: నెలకు రూ. 123 కోట్లు సంపాదిస్తున్న అమ్మాయిలు, ఛీ.. మరీ అలానా?

జీవితంలో హ్యాపీగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి. కానీ, కొంత మంది కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా అనే ఆలోచన చేస్తున్నారు. గొడ్డు కష్టం చేయడం కాదు, కొత్త ఆలోచించాలి. సింఫుల్ గా డబ్బు సంపాదించాలి అనే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు. అమెరికాలో 8 మంది మోడల్స్(American Models) అచ్చంగా ఇదే పని చేస్తున్నారు. విలాసవంతమైన భవంతిలో నివసిస్తూ, ఎవరినీ కలవకుండానే నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, నిజంగా నిజం. ఇంతకీ వాళ్లు ఆ భవనంలో ఏం చేస్తున్నారు? అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఓన్లీ ఫ్యాన్స్ క్రియేటర్స్ గ్రూప్ ఏర్పాటు!

అమెరికాకు చెందిన ఐషా సోఫీ, సోఫీ రెయిన్ అనే మోడల్స్ కు ఓ ఆలోచన వచ్చింది. ఒక విలాసవంతమైన భవంతిలో ఉంటూ బయటకు వెళ్లకుండానే డబ్బులు సంపాదించాలి అనుకున్నారు. వారికి తోడుగా మరో ఆరుగురు మోడల్స్  కెమిల్లా అరౌజో, అలీనా రోజ్,  జూలియా ఫిలిప్పో, సమ్మర్ ఐరిస్,  అవా రేయెస్, జాయ్ మెయిని కలుపుకుని మొత్తంగా 8 మంది ఒక టీమ్ గా ఏర్పడ్డారు. అందరూ పాతికేళ్లలోపు వాళ్లే. వీరంతా కలిసి ఓన్లీ ఫ్యాన్స్ క్రియేటర్స్ (OnlyFans Creators) అనే సంస్థను స్థాపించారు. అందరూ కలిసి మయామిలో నెలకు 75 వేల డాలర్లు అంటే నెలకు రూ. 62 లక్షలు చెల్లించి ఓ విలాసవంతమైన భవనాన్ని(Miami Mansion) అద్దెకు తీసుకున్నారు. సుమారు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. మొత్తం 6 బెడ్ రూమ్ లు, ఐదు బాత్ రూమ్ లు, స్విమ్మింగ్ పూల్, రూఫ్ టాప్ సన్ డెక్ సహా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఈ అమ్మాయిలంతా కలిసి దానికి ‘ది బాప్ హౌస్’(The Bop House) అని పేరు పెట్టారు.


వీళ్లు ఆ భవనంలో ఏం చేస్తారంటే?

ఇక ఆ భవంతిలో ఈ అమ్మాయిలు పెద్దలకు మాత్రమే పరిమితమైన కంటెంట్ ను క్రియేట్ చేస్తారు. వీళ్లంతా కేవలం రెండు నెలల్లోనే టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ లలో 3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించారు.  వీళ్లంతా కలిసి యుకుకులతో ఆ.. రకమైన కాల్స్ లో మాట్లాడుతారు. ఈ ఇంట్లోని వాళ్లంతా అదే పని చేస్తుంటారు. ఇందుకోసం వాళ్లు తగిన ఛార్జ్ వసూళు చేస్తారు. ఈ టీమ్ తొలి నెలలో ఏకంగా $12.4 మిలియన్లు అంటే భారత కరెన్సీలో ఏకంగ రూ. 103 కోట్లు సంపాదించింది. జనవరిలో దాదాపు $15 మిలియన్లు అంటే భారత కరెన్సీలో రూ.125 కోట్లు సంపాదించింది.

‘ది బాప్ హౌస్’ దగ్గర భారీ భద్రత

ఇక ఈ మోడల్స్ కు సంబంధించిన ‘ది బాప్ హౌస్’ దగ్గరికి తరచుగా ఫ్యాన్స్ వచ్చేవాళ్లు. వాళ్లను చూడాలని ప్రయత్నించే వారు. కొన్నిసార్లు రాత్రిపూట తలుపు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నెమ్మదిగా ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ కావడంతో వారి నుంచి కాపాడుకునేందుకు సెక్యూరిటీని పెట్టుకున్నారు. అయితే, తాము ఇంత డబ్బు సంపాదిస్తున్నామంటే దానికి కారణం పురుష సబ్ స్క్రైబర్లే కారణం అంటుంది సోఫీ రెయిన్. త్వరలోనే అద్దె ఇంటిని వదిలి సొంత ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నటలు తెలిపింది. ప్రస్తుతం ఈ టీమ్ అమెరికాలో బాగా ఫేమస్ అయ్యింది.

Read Also: 7 సార్లు చావును చూసి వచ్చాడు, ఆ వెంటనే కోటీశ్వరుడు అయ్యాడు.. ఇంత లక్కీ పర్సన్ ఈ లోకంలోనే లేడు!

Related News

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Big Stories

×