Frane Selak: భూమ్మీద చాలా మంది అదృష్టవంతులు ఉంటారు. కానీ, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. చాలా మంది ఇతడిని ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడే కాదు, అత్యంత దురదృష్టవంతుడు అని కూడా పిలుస్తారు. అతడు మరెవరో కాదు ఫ్రోనో సెలక్. జీవితంలో ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి బయటపడ్డాడు. ఏకంగా ఏడు సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు. నిజానికి సెలాక్ జీవితం ఓ హై ఆక్టెన్ యాక్షన్ మూవీ కథలా ఉంటుంది. పెద్ద ప్రమాదాల నుంచి బయటపడటం, వెంటనే పెద్ద లాటరీని గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఎవరీ ఫ్రోనో సెలక్?
1929లో క్రొయేషియాలో జన్మించాడు ఫ్రోనో సెలక్. మ్యూజిక్ టీచర్ గా సింపుల్ జీవితాన్ని గడిపేవాడు. కానీ, ఆ తర్వాత తన జీవితంలో జరిగిన పలు ప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేశాయి.
⦿ 1962లో జరిగిన రైలు ప్రమాదం సెలక్ జీవితంలో మర్చిపోలేని ఘటనగా నిలిచింది. సారాజేవో నుంచి డుబ్రోవ్నిక్ కు రైల్లో వెళ్తుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా, ఆయన మాత్రం బయటపడ్డాడు. కానీ, ఈ ప్రమాదంలో చెయ్యి విరింగింది.
⦿ ఒక సంవత్సరం తర్వాత అంటే 1963లో సెలక్ జాగ్రెబ్ నుంచి రిజెకాకు విమానం ఎక్కాడు. ప్రయాణ సమయంలో విమానం డోర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. కానీ, సెలాక్ మాత్రం కిందకు దూకాడు. ఆయన నేరుగా గడ్డివాము మీద పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
⦿ 1966లో సెలక్ మరోసారి చావు నుంచి బయటపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు నదిలో మునిగి చనిపోయారు. కానీ, ఆయన ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.
⦿ 1970లో సెలక్ కారులో వెళ్తుండగా మంటలు చెలరేగాయి. కారు పేలిపోయింది. కానీ, ఆయన బయటపడ్డాడు. 1973లో ఇంజిన్ ఆయిల్ లీక్ అయి కారు ఇంజిన్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ప్రమాదంలోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు.
⦿ 1995లో సెలక్ ను ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు అయ్యాయి. 1996లో కారులో ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. అతడి కారు లోయలో పడిపోయి బ్లాస్ట్ అయ్యింది. కానీ, సెలక్ మధ్యలో చెట్టుమీద చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తంగా ఏడు సార్లు చావు అంచువరకు వెళ్లి వచ్చాడు సెలక్.
Read Also: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన TTE.. అయినా దబాయింపు!
రూ. 5 కోట్ల లాటరీ గెలిచిన ఫ్రోనో సెలక్
ఇక 2003లో సెలక్ ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. £600,000 గెలుచుకున్నాడు. 2003 విలువ ప్రకారం ఈ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 5 కోట్లు ఉంటుంది. ఈ డబ్బుతో ఆయన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఇక 2016 నవంబర్ 30న సెలక్ 87 ఏండ్ల వయసులో చనిపోయాడు. మొత్తంగా ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Also: లక్కీ అంటే నీదే గురూ.. రైలు నేరుగా వచ్చి ఢీకొట్టినా..