E-Paper
Advertisement

Professor Jobs: ఈ అర్హతలు ఉంటే చాలు భయ్యా.. నెలకు రూ.2లక్షల జీతం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..

Professor Jobs: ఈ అర్హతలు ఉంటే చాలు భయ్యా.. నెలకు రూ.2లక్షల జీతం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..

Professor Jobs: తెలుగు రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.  పీహెచ్‌ డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది మంచి అవకాశం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌(UOHYD)లొ పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతన ఉండనుంది.

నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOHYD)లో ప్రొఫెసర్, అసోసియేట్  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ లో వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విభాగాలు: మ్యాథ్స్‌, కంప్యూటర్ అండ్ ఇన్‌న్ఫర్మేషన్ సైన్స్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్‌, ఎనిమల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, న్యూరల్ కగ్నిటివ్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లయిడ్‌ లింజిస్టిక్స్ అండ్‌ ట్రాన్స్ లేషన్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌, కమ్యూనికేషన్స్, డాన్స్‌, థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్‌లో పాస్‌తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు 65 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది.  నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 – రూ. 2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 1,31,400 – రూ. 2, 17, 100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ. 57,700 – రూ.1,82,400 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 20

నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా అదనపు సమాచారం కావాలంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రందించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://uohyd.ac.in/teaching-guest-faculty/

Also Read: BHEL Jobs: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇదే లాస్ట్ డేట్.. మిస్ అవ్వకండి..!!

పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్‌ ఉత్తీర్ణత సాధించినవారికి ఇది మంచి అవకాశం. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారు తప్పకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం వస్తే మంచి వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగంలో భారీగా జీతాలున్నాయి. నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 – రూ. 2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 1,31,400 – రూ. 2, 17, 100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ. 57,700 – రూ.1,82,400 వేతనం ఉంటుంది. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×