BigTV English

Agniveer vayu jobs: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ఇదిగో పూర్తి సమాచారం..

Agniveer vayu jobs: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ఇదిగో పూర్తి సమాచారం..

Agniveer vayu jobs: అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి ఇది సువర్ణవకాశం. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్వినియోగం చేసుకోండి. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమవుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి.


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేశారు. అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) (02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూద్దాం.

మొత్తం ఉద్యోగాల సంఖ్య గురించి ఏం తెలియజేయలేదు.


ఇందులో భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఇన్ టేక్2/2025 ఉద్యోగాలు వెకెన్సీ  ఉన్నాయి.

పలు క్రీడల్లో రాణించి ఉండాలి.

క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, లాన్‌ టెన్నిస్‌, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్‌బాల్, సైకిల్ పోలో, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు క్రీడల్లో యువత రాణించి ఉండాలి

విద్యార్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2 (మ్యాథ్స్‌, ఫిజిక్స్, ఇంగ్లిష్‌) లేదా ఏదైనా స్ట్రీమ్/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి./ వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ తప్పనిసరిగా ఉండాలి.

హైట్: 152 సెంటీ మీటర్లు కనీస ఎత్తు ఉండాలి.

వయస్సు: 2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: సెలెక్షన్‌ టెస్ట్‌, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంపార్టెంట్ డేట్స్:

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 13

ఆన్ లైన్ రిజిస్ట్రేష్ కు చివరి తేది: 2025 ఫిబ్రవరి 22

రిక్రూట్ మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: 2025 మార్చి 10 నుంచి మార్చి 12 వరకు ఉంటుంది.

ట్రయల్స్ వేదక: తేజస్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూదిల్లీ, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూదిల్లీ.

నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/AV/

Also Read: Professor Jobs: ఈ అర్హతలు ఉంటే చాలు భయ్యా.. నెలకు రూ.2లక్షల జీతం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..

ముఖ్యమైనవి:

భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ వచ్చేసింది.

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 22

అగ్నివీర్ వాయు ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది.

Related News

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

Big Stories

×