Lady Aghori Arrest : లేడీ అఘోరీ అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని పట్టుకున్నారు. అఘోరీ పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తీసుకొస్తున్నారు. బుధవారం మధ్యాహ్నానికి అందరూ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.
కేస్ ఏంటంటే..
యో*ని పూజ చేస్తానంటూ తన నుంచి రూ. 10 లక్షలు వసూల్ చేసినట్టు ఓ మహిళ ఇప్పటికే మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్టు చెప్పారు. ఆ కేసులో అఘోరీపై ఫిబ్రవరి 25న FIR కూడా నమోదైంది.
అఘోరీ ఎలా బెదిరించిందంటే..
హైదరాబాద్‌కు చెందిన ఓ ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ తమకు ఇంట్లో సమస్యలు ఉన్నాయంటూ లేడీ అఘోరీని సంప్రదించారు. ప్రత్యేక తాంత్రిక పూజలు చేయాలంటూ.. అందుకు రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని అఘోరీ చెప్పిందట. ఉజ్జయిని తీసుకెళ్లి పూజ చేయించిందట. ఆ తర్వాత మరో పూజ కూడా చేయాలని.. చేయకపోతే మీకే నష్టమంటూ బెదిరించి.. మరో 5 లక్షలు డిమాండ్ చేసిందట. అలా రెండు దఫాలుగా 10 లక్షలు ఇచ్చినట్టు తెలిపింది బాధితురాలు. ఆ తర్వాత కూడా అఘోరీ వేధింపులు ఆగలేదని.. తాంత్రిక పూజల గురించి ఇంట్లో వాళ్లకు చెబుతానంటూ మన భర్తకు పదే పదే ఫోన్ చేస్తూ.. ఇంకో రూ. 5 లక్షలు ఇవ్వాలని టార్చర్ చేసినట్టు అఘోరీ మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది ఆ బాధితురాలు. ఆ కేసులో ఇన్నాళ్లూ వేచి చూసిన పోలీసులు.. ఇప్పుడు లేడీ అఘోరీని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు.
వర్షిణి పరిస్థితేంటి?
ఇటీవలే శ్రీవర్షిణిని మెడలో ముచ్చటగా మూడోసారి మూడుముళ్లు వేసింది లేడీ అఘోరీ. కొత్త కాపురం మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉండగా.. ఇలా పాత కేసు కొత్తగా అఘోరీ మెడకు చిక్కుకుంది. ఆ చీటింగ్ కేసులో అఘోరీ అరెస్ట్ అయి జైలుకు వెళితే? వర్షిణి పరిస్థితి ఏంటి? అఘోరీ లేకుండా వర్షిణి ఉండగలదా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
మొదటి భార్య ఊరుకుంటుందా?
అటు, అఘోరీ తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ ఆమె మొదటి భార్య రాధిక సైతం ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వర్షిణితో జరిగిన రెండోపెళ్లి చెల్లదని వాదిస్తోంది. స్వతహాగా లాయర్ అయిన రాధిక.. అఘోరీని మరింత చిక్కుల్లో పడేస్తుందా? వరుస కేసులతో లేడీ అఘోరీకి ఇబ్బందులు తప్పవా? కేసుల మీద కేసులు పడితే.. అఘోరీ తట్టుకోగలదా? ఇలా అనేక అనుమానాలు. ఇదే అదునుగా వర్షిణి పేరెంట్స్ కూడా రంగంలోకి దిగి లేడీ అఘోరీపై చర్యలకు పట్టుబట్టొచ్చని తెలుస్తోంది.
Also Read : ఓవర్‌టేక్ చేశారని.. రూ. 8 లక్షల బైక్ ధ్వంసం..
వర్షిణితో పెళ్లి కలిసిరాలేదా?
శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ అఘోరీకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ఇటు మోకిలాలో కేసు.. అటు రెండో భార్య నుంచి సవాళ్లు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టున్నారు వాళ్లిద్దరూ. అందుకే తమ జోలికి ఎవరూ రావొద్దని.. తమ బతుకు తాము బతుకు తామని.. అంటున్నారు. తమను వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటామని కూడా బెదిరిస్తున్నారు. చేసేదంతా చేసి.. సూసైడ్ చేసుకుంటామంటే ఎలా? మీడియాలో పబ్లిసిటీ కోసం ఇన్నాళ్లూ తహతహలాడి.. ఇప్పుడు ఎవరూ ప్రశ్నించొద్దు అంటే ఎట్టా?