Jeevitha Rajasekhar: మామూలుగా ఒక హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారి పెళ్లి ఎక్కువకాలం నిలబడదు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు అలా కాదు.. తెలుగులో సైతం ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పటికీ కలిసున్న జంటలు ఉన్నాయి. అందులో జీవిత, రాజశేఖర్ కూడా ఒకరు. వీరిద్దరి పర్సనల్ లైఫ్‌పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటన్నింటిని పట్టించుకోకుండా ఫ్యామిలీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు. వీరి వారసురాళ్లను కూడా హీరోయిన్స్‌గా పరిచయం చేశారు. కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవిత.. రాజశేఖర్‌తో ప్రేమలో ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. హీరోను పెళ్లి చేసుకోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.
కలిసే ఉన్నాం
రాజశేఖర్ హీరో కాబట్టి అమ్మాయిలు తన వెంటపడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అనే ప్రశ్న జీవితకు ఎదురయ్యింది. ‘‘నేను స్ట్రాంగ్‌గా ఉంటే నన్ను వదిలి ఎవ్వరూ వెళ్లలేరు. గొడవలు రానప్పుడు వాళ్లు మనకు దూరమయిపోతారు అనే భయం కూడా ఉండదు. రాజశేఖర్ దగ్గర నచ్చేది ఏంటంటే నాకు ఏది చెప్పకుండా ఉండరు. ఒకవేళ ఒక అమ్మాయి ఫోన్ చేసి నా దగ్గరకు రండి అన్నా కూడా నాకు చెప్పేస్తారు. అలాంటివి చాలా జరిగాయి’’ అని బయటపెట్టారు జీవిత రాజశేఖర్. ప్రేమలో ఉన్నప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండేది అనుకున్నారు కానీ పెళ్లిపై పూర్తిగా క్లారిటీ లేదట. అయినా కూడా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారని, అప్పట్లో వీరి ప్రేమ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అని చెప్పుకొచ్చారు జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar).
బాధగా అనిపించింది
ఒకవేళ రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితతో రిలేషన్ ఇలాగే ఉండాలని ముందే ఫిక్స్ అయ్యారట. ఇది తెలిసి వాళ్ల అమ్మా, నాన్న బాధపడినా కూడా ఇది ఇలాగే ఉంటుందని సీరియస్‌గా చెప్పేశారట జీవిత. ఒకానొక సందర్భంలో రాజశేఖర్‌కు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిపోవడం గురించి కూడా బయటపెట్టారు. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ అమ్మాయితో రాజశేఖర్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. దానివల్ల నాకు చాలా బాధగా ఉన్నా ఇదంతా జరుగుతుందని నేను ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాను. అలా రెండు కుటుంబాలు కలవడం పూర్తయిన తర్వాత ఒకరోజు నన్ను తీసుకెళ్లి ఆ అమ్మాయికి పరిచయం చేశారు’’ అని చెప్పుకొచ్చారు జీవిత.
Also Read: రెమ్యునరేషన్ కచ్చితంగా పెంచుతాను, ఎందుకంటే.. నిజాన్ని బయటపెట్టిన ప్రియదర్శి
అలా క్యాన్సెల్ అయ్యింది
‘‘ఆ అమ్మాయిని కలిసిన తర్వాత ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక జ్వరం వచ్చేసింది. రాజశేఖర్‌కు పెళ్లి మాటలు జరుగుతున్న సమయంలోనే ఇంద్రధనస్సు అనే సినిమాలో నటిస్తున్నాం. ఒకరోజు సెట్‌లో ఆయన చాలా కంగారుగా కనిపించారు. ఏమైంది అని అడిగితే జీవితతో మాట్లాడకపోతేనే ఈ పెళ్లి జరుగుతుందని ఆ అమ్మాయితో పాటు తన తల్లిదండ్రులు కూడా బలవంతపెడుతున్నారు అని చెప్పారు. అలా రాత్రంతా ఆ అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. పెళ్లి క్యాన్సెల్ చేశారు’’ అని తెలిపారు జీవిత. ‘మగాడు’ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్‌కు యాక్సిడెంట్ కాగా తనను జీవిత చూసుకున్న తీరు చూసి ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయని బయటపెట్టారు.